ఆ తప్పు చేశా కాబట్టి.. అలా అయ్యింది..!

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ లో ఇప్పుడు ఏ సినిమాలో చూసినా పూజ హెగ్డే నే కనిపిస్తుంది వరుస సినిమాలతో బిజీగా ఉంది. ‘డిజే’  సినిమా వచ్చేవరకు అసలు ఈ అమ్మడుకి మార్కెట్ ఏ లేదు. డిజే సినిమాతో పూజా కెరీర్ ఏ మారిపోయింది. అంతకు ముందు వరకు ఈమెపై ఒక సెంటిమెంట్ కూడా ఉండేది. ఈమె నటించే సినిమాలు అస్సలు ఆడవని కానీ ప్రస్తుతం ఈమె నటించిన సినిమాలన్నీ మంచి హిట్ దక్కించుకుంటున్నాయి. ఇక అస్సలు కాళిగా ఉండట్లేదు ఈ భామ.

అయితే పూజ ఇండస్ట్రీకి వచ్చి ఐదు సంవత్సరాలు గడిచినా ఇంకా కూడా చేతుల మీదే సినిమాలు లెక్కపెట్టుకోవచ్చు ఐతే దీనికి గల కారణాన్ని ఒక రిపోర్టర్ ఆమెని అడగగా.. కెరీర్ మొదట్లోనే నేను తప్పు చేశాను కెరీర్ ప్రారంభం అవ్వగానే మొహెంజొదారో సినిమా ఆఫర్ వచ్చింది. మంచి సినిమా రావడం తో నా రెండేళ్ల డేట్స్ ని సినిమా కి ఇచ్చేశాను. అదే నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్. నా రెండేళ్ల కెరీర్ లో నేను ఎన్నో సినిమాలు చేయవచ్చు కానీ నేను ఆ సినిమాకి పరిమితం అయ్యి రెండేళ్ళు వృదా చేశాను నాకు అప్పుడు తెలియదు ఒక నటి జీవితం లో రెండేళ్ళు అంటే ఎంత క్లిష్టమో.. అంటూ ఇదే సినిమాలు ఎక్కువ రాకపోవడానికి కారణం అని ఆమె చెప్పుకొచ్చింది.

Share.

Comments are closed.

%d bloggers like this: