నిన్న రాహుల్ నేడు అవినాష్..! ఫిదా అయిన స్థానికులు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

నిన్న రాహుల్ గాంధీ నేడు దేవినేని అవినాష్ సహృదయులుగా చాటుకున్నారు వారి చర్యలతో మానవతా భావం తో జనం మనసులు గెలిచారు. నిన్న రాహుల్ గాంధీ గాయపడ్డ ఒక జర్నలిస్ట్ ని తన కారు లో ఎక్కించుకొని ఆసుపత్రికి తీసుకెళ్ళాడు ఇక నేడు దేవినేని అవినాష్ కూడా ఇదే తరహాలో ఒక చిరు వ్యాపారిని గాయపడటం చూసి ఆసుపత్రికి తీసుకెళ్ళాడు అంతేకాకుండా వైద్యానికి అవసరమైన కొంత నగదుని కూడా ఆ భాదితుడికి ఇచ్చారు. అవినాష్ స్పందించిన తీరుకి అక్కడి జనం ఫిదా అయ్యారు.

ఎన్నికల ప్రచారం లో భాగంగా గుడివాడ టీడీపీ అభ్యర్థి అవినాష్ పర్యటిస్తున్నారు, బుద్దమేరు మిడిగా ఆయన తన కారు లో వెళుతుండగా అక్కడ ఒక రోడ్డు ప్రమాదం జరగడం చూసి వెంటనే అక్కడికి చేరుకున్నాడు ఘటనా స్థలానికి చేరుకున్న అవినాష్ అక్కడ గాయపడ్డ ఒక జామకాయల వ్యాపారిని పరామర్శించాడు.. స్థానికుల సహాయామ్ తో ఆ గాయపడ్డ వ్యాపారిని తన సొంత కారులో ఎక్కించుకొని ఆసుపత్రికి తీసుకుని వెళ్ళాడు. ఆ వ్యాపారికి వైద్యానికి సరిపడా కొంత నగదుని కూడా ఇచ్చాడు. ఇక అవినాష్ ఇలా చేయడం చూసిన అక్కడి స్థానికులు అవినాష్ కి ఫిదా అయ్యారు. అవినాష్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: