ప్రియాంక ని చంపేయాలనుకున్నా..!

Google+ Pinterest LinkedIn Tumblr +

బాలీవుడ్ భామ ప్రియాంకా చోప్రా అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్ సినిమాల్లోనే కాకుండా ప్రియాంకా హాలీవుడ్ లోనూ సినిమాలు తీస్తుంది. క్వాంటికో అనే ఆంగ్ల వెబ్ సిరీస్ లో కూడా ప్రియాంకా మంచి క్యారెక్టర్ ప్లే చేసి మంచి ప్రశంసలు దక్కించుకుంది. బేవాచ్ అనే సినిమాలో అక్కడి ఆగ్ర నటులతో ప్రియాంకా జత కట్టింది. ఇక తాజాగా ప్రపంచపు అత్యంత శక్తివంతమైయన మహిళల లిస్ట్ లో కూడా ప్రియాంక చోటు సంపాదించుకుంది. తాజాగా ఆమె నిక్ జోనస్ అనే హాలీవుడ్ సింగర్ మరియు నటుడిని పెళ్లి చేసుకుని ఇప్పుడు ఆయనతో అమెరికాలోనే నివాసం ఉంటుంది. ప్రస్తుతం ఆమె స్కై ఇస్ పింక్ అనే బాలీవుడ్ సినిమాలో నటిస్తుంది ఇక పోతే హాలీవుడ్ లోనూ పెద్ద ప్రాజెక్టుల్లో ఆమె బిజీగా ఉంది.

ఈ విషయం ఇలా ఉండగా తాజాగా ఆమెని చంపేయాలనిపించింది అని ఒక వ్యక్తి చెప్పి అందరినీ షాక్ కి గురిచేశాడు. వివరాల్లోకి వెళితే ఎం టీవీ లో నిర్వహించే రోడిస్ షో కి ఒక వ్యక్తి కంటెస్టెంట్ గా వచ్చాడు. ఆ వ్యక్తి పేరు సారంగ్. సారంగ్ తన దారకాస్తు లో భాగంగా ప్రియాంకాని చంపేయాలనిపించేది అని రాశాడు. అయితే ఈ షో కి జెడ్జ్ గా నిర్వహిస్తున్న నేహా దూపియా ఆ వ్యక్తి దారకాస్తు పరిశీలించి ఎందుకు ప్రియాంకా ని చంపేయాలనిపించింది అని అడిగింది. అప్పట్లో నేను బ్యాక్ డ్యాన్సర్ గా పని చేసేవాడిని.. ఎన్నో అవార్డ్ ఫంక్షన్స్ కి బ్యాక్ డ్యాన్సర్ గా పని చేశాను. అవార్డ్స్ ఫంక్షన్ కి మేము పనిచేస్తున్న సమయంలో ఎవ్వరితోనూ కష్టం అనిపించలేదు.. కానీ ప్రియాంక తోనే ఎక్కువగా కష్టపడ్డా..! రిహార్సెల్స్ గురించి డ్యాన్స్ కి ప్రిపేర్ అవుతుంటే లాస్ట్ వరకు ఉండి స్టెప్స్ మార్చేసేది. ఆమె ప్రాక్టీస్ గురించి మమ్మల్ని లంచ్ కి కూడా వెళ్లనిచ్చేది కాదు. అలా ఎన్నో సార్లు తినకుండానే ఉండిపోయాము. అలా ఏంతో కష్టపడేవాల్లము, అందుకే అప్పట్లో ప్రియాంకాని చంపేయాలనిపించేది అని ఆయన అన్నాడు.

Share.

Comments are closed.

%d bloggers like this: