ప్రధానిగా మోదీ పోవాలి చంద్రబాబు రావాలి- కేజ్రీవాల్

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన అనుభవాన్ని పరిచయాలని కూడా వాడుతున్నారు నిన్న ఆయన ప్రచారంలో పాల్గొనాలంటు కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా ని కోరగా ఆయన వచ్చి చంద్రబాబు సభలో పాల్గొన్నారు.. అంతే కాకుండా ప్రతిపక్ష నేత జగన్ పై కూడా విమర్శలు చేశాడు. ఇకపోతే నేడు చంద్రబాబు ప్రచారానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హాజరయ్యారు. ఇలా చంద్రబాబు ప్రజలని ఆకర్షించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు ప్రజల తీరు ఎలా ఉండబోతుందో తెలుసుకోడానికి వేచి చూడాలి.

కృష్ణ జిల్లా వినుకొండ నియోజకవరగంలో పాల్గొన్న అరవింద్ చంద్రబాబుని పొగడ్తలతో కొనియాడారు. ఏపీలోని 25 ఎంపీ స్థానాల్లో టీడీపీని గెలిపించి చంద్రబాబును కేంద్రంలో చక్రం తిప్పేలా ప్రజలు చేయాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కోరారు. దేశంలో ప్రధాని మోదీ పోవాలని, ఏపీలో చంద్రబాబు రావాలని అభిలషించారు. ఏపీని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లగలిగిన నాయకుడు చంద్రబాబు అని కేజ్రీవాల్ అన్నారు. దేశంలో ఎవరూ చేయని విధంగా ఏపీని అభివృద్ధి చేశారని, వృద్ధులు, మహిళలు, రైతులు అన్ని వర్గాల వారిని ఆదుకున్నారన్నారు. చంద్రబాబు ఎన్నో పథకాలు అన్ని వర్గాల వారి సంక్షేమం కోసం అమలు చేశారని కేజ్రీవాల్ కొనియాడారు. మోదీ దేశాన్ని తిరోగమనం వైపు తీసుకెళ్లారని, తన స్వార్థం కోసం కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టారన్నారు. జగన్‌కు ఓటేయడమంటే బీజేపీకి ఓటేయడమేనని ప్రజలు గుర్తించాలన్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: