”వారణాసి నుండి పోటీ చేయనా”.. ? అంటున్న ప్రియాంక

Google+ Pinterest LinkedIn Tumblr +

తాజాగా పార్టీలోకి వచ్చిన ప్రియాంక గాంధీ ఎన్నికల బరిలోకి దిగడానికి సిద్ధంగా ఉంది. అయితే ప్రియాంక ఈసారి వారణాసి నుండి పోటీకి దిగుతుందని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇక వారణాసి నుండి దేశ ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేస్తున్నాడు. ఇక ఆయన పై పోటీ చేయాలని ప్రియాంక భావిస్తుందట..! ఎన్నికల బరీ లోకి దిగిన మొదటిసారె ప్రియాంకా ఈ నిర్ణయం తీసుకోడాన్ని కాంగ్రెస్ వర్గాలు స్వాగతిస్తున్నాయి.. ఈ విషయమై ప్రియాంకా చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ నేతల్లో జోష్ ని నిపుతున్నాయి.

ఎన్నికలు దేగ్గర పడుతుండటంతో దేశ ప్రధాన పార్టీలు ప్రచారాలు జోరుగా చేస్తున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుండి ప్రియాంక యూపీ లో ప్రచారం చేస్తుంది. ప్రచారం లో భాగంగా గురువారం ఆమె రాయబరేలి లో ఎన్నికల ప్రచారం నిర్వహించింది. ఈ ప్రచారం లో పాల్గొన్న కార్యకర్తలు మీరు ఇక్కడ నుండే పోటీ చేయాలని నినాదాలు చేశారు. ఇక ఈ నినాదాలకి స్పందిస్తూ ఆమె వారణాసి నుండి చేద్దాం అనుకుంటున్నా వారణాసి నుండి వద్దా అని ప్రశ్నించింది. మీ ఇష్టం పోటీకి ఎక్కడైనా ఒకే అని కార్యకర్తలతో అనింది,మరోసారి వారణాసి నుండి పోటీ చేయనా అని ఆమె అనింది. ఆమే తన మనసులో ఉన్న మాట ని కార్యకర్తలతో వెల్లడించిందని కాంగ్రెస్ వర్గాలు బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. మరి చూడాలి ఆమె ఎక్కడనుండి పోటీ చేస్తుందో.. ఇక ఆమె వ్యాఖ్యలకి బీజేపీ వ్యంగ్యంగా స్పందిస్తూ.. పోటీ చేసిన మొదటి సారె ఓడిపోయే తొలి నేత అవ్వడం గ్యారంటీ అని అంటున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: