పోసాని పై సినీ నటుడు అలీ కామెంట్స్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

నేడు పోసాని కృష్ణ మురళి తెరకెక్కిస్తున్న చిత్రం “ముఖ్యమంత్రిగారు మాటిచ్చారు” సినిమా టైటిల్ ఆవిష్కరణ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ నటుడు ప్రముఖ కమెడియన్ అలీ హాజరయ్యారు. ఈ సంధర్భంగా అలీ మాట్లాడుతూ పోసాని వ్యక్తిత్వం పై పొగడ్తలు కురిపించాడు. ఆయన మాట్లాడుతూ నా సహనటుడు పోసాని ఎంతో మందికి సహాయం చేశాడు. ఎంతమందికి సహాయం చేసినా చెప్పుకోదు. పోసానిది మంచి మనసు. అక్కడ మాటలు ఇక్కడ ఇక్కడ మాటలు అక్కడ చెప్పడు. అని అలీ అన్నారు.

పోసాని మంచి మనసు భగవంతుడికి తెలుసు అందుకే నాయక్ సినిమా తో మంచి బ్రేక్ ఇచ్చి ఇక అప్పటినుండి మంచి కమెడియన్ గా పోసాని గుర్తింపు తెచ్చుకున్నాడు. అక్కడ నుండి పోసాని ప్రస్థానం అందరికీ తెలుసు. ఆయన ఎంత మంచి కమెడియనో అంతకన్నా మంచి మనిషి అని అలీ కొనియాడారు. ఆయన నిర్మాతగా నటిస్తున్నప్పుడు తీసిన సినిమాల్లో నటించిన ప్రతీ ఒక్కరికీ పారితోషికం అందించాడు ఎవ్వరి దేగ్గరా డబ్బు ఎగ్గొట్టలేదు..! సినిమా ఆడినా ఆడకపోయ్న పోసాని అప్పు చేసీ మరీ పారితోషికాలు ఇచ్చాడు. అది పోసాని అంటూ అలీ సెలవిచ్చాడు.

Share.

Comments are closed.

%d bloggers like this: