ఇక్కడ వార్ వన్ సైడ్.. గెలుపు ఖాయం- కారణం బలరాం..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు రసవత్తరంగా మారాయి.. కొన్ని నియోజకవర్గాల్లో ఐతే ఎవరు గెలుస్తారో అనేది అస్సలు అంచనా వేయలేము అలాంటి నియోజకవర్గమే చీరాల. ఈసారి చీరాల లో అభ్యర్థులు ఇద్దరు ఒకరికి మించి ఒకరు అన్నట్టుగా ఉన్నారు టీడీపీ నుండి కారణం బలరాం వైసీపీ నుండి ఆమంచి కృష్ణ మోహన్. ఇద్దరికీ మంచి పలుకుబడి మంచి ఓట్ బ్యాంక్ ఉంది ఇక ఇద్దరి మధ్య పోటీ మంచి రసవత్తరంగా ఉండబోతుంది అనే చెప్పొచ్చు.

ఇక ఈ విషయమై కారణం బలరాం తో మాట్లాడగా.. కరణం బలరాంను 50 వేల మెజార్టీతో ఓడిస్తానని ఆమంచి చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. తనను ఓడించాలంటే వాళ్ల తాతలు దిగిరావాలంటూ తన గెలుపుపై కరణం ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో ప్రజలు మిమ్మల్ని ఎందుకు గెలిపించాలన్న ప్రశ్నకు కరణం జవాబిస్తూ, ప్రజలతో మమేకమై ఉంటానని, వర్క్ మైండ్ తో పని చేస్తానని, అనవసరమైన ఆలోచనలు తనకు లేవని, ప్రశాంతమైన వాతావరణంలో పని చేస్తానని చెప్పి సీఎం చంద్రబాబు తనను ఇక్కడి నుంచి పోటీ చేయమని చెప్పారని అన్నారు. చీరాలలో ‘నువ్వా? నేనా’ అన్న విధంగా ఎన్నికలు జరగుతాయన్న వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఇక్కడ వన్ సైడ్ పోలింగ్ జరుగుతుందని, టీడీపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Share.

Comments are closed.

%d bloggers like this: