మెదక్ కి దేశంలోనే అత్యధిక మెజారిటీ రావాలి-హరీష్

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలంగాణ స్టార్ కేంపెయినర్ హరీష్ రావు లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆయన సిద్దిపేట లో నిర్వహించిన సభకి హాజరయ్యారు. మేదక్ పార్లమెంట్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాల్సిందిగా కార్యకర్తలని ప్రజలని కోరాడు. ఆయన మాట్లాడుతూ.. ఏప్రిల్ 11 న జరిగే లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరగాలని ప్రభాకర్ రెడ్డికి నాకన్నా ఒక్క ఓటు ఎక్కువే రావాలని ఆయన కార్యకర్తలని కోరారు.

దేశంలో అత్యధిక మెజార్టీతో గెలవబోతున్న వ్యక్తి ప్రభాకర్‌ రెడ్డే అని ధీమా వ్యక్తం చేశారు. సిద్ధిపేటకు ఎన్నికలకు కొత్త కాదని తెలిపారు. ప్రభాకర్‌ రెడ్డి కృషితో సిద్ధిపేట మీదుగా రెండు జాతీయ రహదారులే కాక జిల్లాకు పాస్‌పోర్టు ఆఫీస్‌, కేంద్రియ విద్యాలయం మంజూరయ్యాయని పేర్కొన్నారు. బుల్లెట్‌ రైలు వేగంతో జిల్లాలో రైల్వే పనులు జరుగుతున్నాయని తెలిపారు. రైల్వే లైన్‌ పనులకు, భూసేకరణ కొరకు అవసరమయిన రూ.400 కోట్లను తెలంగాణ ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు. నర్సాపురంలో ఏప్రిల్‌ 3న జరిగే సీఎం కేసీఆర్‌ సభకు సిద్ధిపేట నుంచి 20 వేల మంది తరలిరావాలిని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Share.

Comments are closed.

%d bloggers like this: