తల్లి ప్రియుడే..3ఏళ్ళ చిన్నారిపై 10రోజుల పాటు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఒకటి కాదు, రెండు కాదు వరుసగా పది రోజులు పాటు ఆ మూడేళ్ళ చిన్నారికి నరకయాతన చూపించారు. అది కూడా ఆ చిన్నారి తల్లి సమక్షంలోనే. ఇందులో ఆశ్చర్యం ఏంటంటే ఆ తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకున్నయువకుడే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటన తమిళనాడు పోలీసుల విచారణతో వెలుగులోకి వచ్చింది.

పోలీసుల కథనం ప్రకారం.. తమిళనాడులోని తిరువళ్లూరులో నివసించే ఓ వివాహిత (30) మార్చి 14న ఇంటి నుంచి తన మూడేళ్ల చిన్నారితో పాటు అదృశ్యమంది. భార్య కనిపించకపోవడంతో పుట్టింటికి వెళ్లిందేమోనని ఆమె భర్త ఆరా తీశాడు. అయితే అక్కడికి కూడా రాలేదని ఆమె తల్లిదండ్రులు చెప్పడంతో తిరువళ్లూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు ఆ భర్త. అయితే మార్చి 26న అతని భార్య ఇంటికి తిరిగొచ్చింది. ఇంటికొచ్చిన భార్యను ఆ భర్త ప్రశ్నించడంతో తన బంధువుల ఇంటికి వెళ్ళినట్టు చెప్పింది. అయితే ఇంటికి వచ్చిన రెండు రోజులకే చిన్నారి తీవ్ర అనారోగ్యం పాలైంది. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. చిన్నారి లైంగిక దాడికి గురైందని వైద్యులు నిర్దారించారు. దీనిపై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు చిన్నారి తల్లిని విచారించగా.. అసలు నిజం బయటపెట్టింది.మార్చి 14న తాను ఆంధ్రప్రదేశ్‌లోని తన ప్రియుడు శివ(32)ను కలిసేందుకు వెళ్లినట్టు తెలిపింది. అక్కడ శివ, అతని బంధువుతో కలిసి చిన్నారిపై 10 రోజుల పాటు లైంగిక దాడికి పాల్పడినట్టు వెల్లడించింది. దీంతో పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Share.

Comments are closed.

%d bloggers like this: