బుద్ధా సవాల్.. రాజకీయాలు వదిలేస్తా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

వైసీపీ నాయకుడు, ప్రముఖ సినీనటుడు మంచు మోహన్ బాబుపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న తీవ్ర ఆరోపణలు చేశారు. మోహన్ బాబు ఇటీవల వైసీపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. కాగా.. వైసీపీ తరపున ఆయన ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొంటున్నారు. ఈ ప్రచారంలో మోహన్ బాబు చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కాగా.. దీనిపై బుద్ధా వెంకన్న స్పందిస్తూ.. చంద్రబాబుపై బురద చల్లేందుకు మోహన్ బాబుకి జగన్ ఎంత పారితోషికం ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. పారితోషికం ఇవ్వందే ఏమీ మాట్లాడరని సినీ పరిశ్రమలో ఆయనకున్న పేరని ఆరోపించారు. పది రోజుల కాల్ షీట్లను జగన్‌కు మోహన్ బాబు అమ్ముకున్నారని ఆరోపించారు. సినిమాల్లో తనకు అవకాశాలు ఇప్పించిన ఎన్టీఆర్‌కు, గురువు దాసరి నారాయణరావుకే పంగనామాలు పెట్టిన చరిత్ర మోహన్ బాబుది అని బుద్ధా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోహన్ బాబు ఉత్తముడని లక్ష్మీపార్వతితో స్టేట్ మెంట్ ఇప్పిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని బుద్ధా వెంకన్న సవాల్ విసిరారు. హైదరాబాద్ లో తనకు సెంటు స్థలం కూడా లేకపోవడానికి మోహన్ బాబే కారణమని రజనీకాంత్ గతంలో చెప్పిన విషయాన్ని బుద్ధా వెంకన్న ప్రస్తావించారు.

Share.

Comments are closed.

%d bloggers like this: