హైదరాబాద్‌ నడిబొడ్డున మాయావతితో కలిసి పవన్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీ ఈ ఎన్నికల్లో బీఎస్పీ, వామపక్షాలతో జట్టు కట్టిన సంగతి తెలిసిందే. పొత్తులో భాగంగా 21 అసెంబ్లీ స్థానాలు, 3 ఎంపీ సీట్లను బీఎస్పీకి కేటాయించింది. కాగా, పొత్తు ధర్మంలో భాగంగా బీఎస్పీ అధినేత్రి మాయవతి ఈనెల 2న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రానున్నారు. పవన్ కళ్యాణ్‌తో కలిసి ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆమె మంగళవారం రాత్రి విశాఖపట్నం చేరుకుంటారు. బుధవారం ఉదయం విశాఖపట్నంలో పవన్‌కళ్యాణ్‌‌తో కలిసి ఆమె మీడియా సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొంటారు. అలాగే గురువారం మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీ స్టేడియంలో జరిగే భారీ బహిరంగ సభకి మాయావతి హాజరవుతారు. అదేరోజు సాయంత్రం 5 గంటలకు పవన్‌కళ్యాణ్‌తో కలసి హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభలో మాయావతి ప్రసంగిస్తారు.

Share.

Comments are closed.

%d bloggers like this: