మొసలి కన్నీరు..! అద్దె మైకులు..! వలస పక్షులు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఎలక్షన్ మిషన్ 2019లో భాగంగా మంగళవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అమరావతిలో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కేసీఆర్, మోదీ, జగన్ లపై మండి పడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్ర నేతలనీ బెదిరిస్తున్నారని ఆయన బెదిరింపుల వల్లే నేతలు నటులు వైసీపీ లోకి వెళుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ పలు అంశాల గురించి ప్రస్తావిస్తూ జగన్ కేసీఆర్ లపై ద్వజమెత్తారు.

వైసీపీ నేతలు మొసళ్ళని మొసలి కన్నెరు నమ్మరాదని ఆయన అన్నారు. మొసలి కన్నీరు కారుస్తూ ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.. ఒకేసారికదా అని మనం అన్నం లో విశాం కలుపుకోము కదా..? ఒకేసారి కదా అని లోయలో దూకము కదా అని ఆయన నేతలనీ ప్రశ్నించారు. పసుపు కుంకుమ పథకం పై వైసీపీ అధినేత అదూగోడ వేస్తున్నాడని ఆయన అన్నారు. ఆడపడుచులకి పసుపు కుంకుమ ఇస్తుంటే ఎవరైనా ఆపుతారా అని ఆయన ప్రశ్నించారు. పసుపు-కుంకుమ డబ్బులు ఆపాలని వైసీపీ నేతలు హైకోర్టులో పిటిషన్లు వేయడంపై చంద్రబాబు మండిపడ్డారు. ఈ వలస పక్షులన్నీ ఇప్ప్దుడు ప్రచారం చేసినప్పటికీ ఎన్నికలు ముగియగానే అందరూ హైదరబాద్ కి చెక్కేస్తారని ఆయన అన్నారు. సాగర్ శ్రీశైలం తమకే కావాలన్న వ్యక్తితో కలవడం ఏంటని ఆయన ప్రశ్నించాడు. కోర్టు కేసుల కోసం మోడీతో, ఆస్తుల కోసం కేసీఆర్‌తో జగన్ లాలూచీ పడ్డారని ఆయన విమర్శించారు.

Share.

Comments are closed.

%d bloggers like this: