గుడివాడ గడ్డ పై ఎగిరే జెండా నాదే..- నాని

Google+ Pinterest LinkedIn Tumblr +

ఎన్నికల ప్రచారం జోరందుకుంటుంది.. సభలు పచ్చ గడ్డిలా ఉంటే అభ్యర్థుల విమర్శలు నిప్పులా మారి ఆ పచ్చి గడ్డిని సైతం బగ్గుమనెలా చేస్తున్నాయి. ఈక్రమంలో గుడివాడలో అభ్యర్థులు ఒకరికి ఒకరు ధీటుగా ఉన్నారు.. గెలుపు ఎవరిదీ అనేది చెప్పడం చాలా కష్టం. అధికార పార్టీ టీడీపీ నుండి దేవినేని అవినాష్ బరీ లో ఉంటే ప్రతిపక్ష పార్టీ వైసీపీ నుండి కొడాలి నాని ఉన్నారు. చంద్రబాబు అవినాష్ తరఫున గుడివాడలో ప్రచారం చేసినప్పుడు నాని పై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే.. ఇక నేనేమీ తక్కువ తినలేదు అన్న రీతిలో నాని కూడా నేడు జరిగిన రోడ్ షోలో విరుచుకపడ్డారు.. అవినాష్ పై బాబు పై తారా స్థాయిలో ఫైర్ అయ్యారు.

నాని మాట్లాడుతూ.. అందిన కాడికి దోచుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు అని ఆరోపించారు. చంద్రబాబు మైండ్‌ పనిచేయడం లేదని ధ్వజమెత్తారు. గతంలో 9 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు గుడివాడకు ఏమీ చేయలేదని గుర్తు చేశారు. తీరా ఎన్నికలు వచ్చేసరికి అబద్దపు హామీలు ఇస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. ఎన్టీఆర్‌ హయాంలో చేపట్టిన పనులను సైతం ప్రారంభించలేకపోయిన దద్దమ్మ చంద్రబాబు అంటూ నిప్పులు చెరిగారు.

గుడివాడ గడ్డపై తనను ఓడించే దమ్ము లేక విజయవాడ నుంచి దేవినేని అవినాష్‌ను తీసుకొచ్చి తనపై పోటీకి నిలబెట్టారన్నారు. నిరహారదీక్ష చేస్తున్న వంగవీటి రంగాను, ఆయన అనుచరులను చంపిన ఘనుడు దేవినేని నెహ్రూ అని గుర్తు చేశారు. నెహ్రూ తనయుడే దేవినేని అవినాష్ అని అలాంటి వ్యక్తికి ఓటేస్తారా అంటూ నిలదీశారు. గుడివాడలో ఎవరు అడుగుపెట్టినా ఎగిరేది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జెండాయేనని కొడాలి నాని ధీమా వ్యక్తం చేశారు.

Share.

Comments are closed.

%d bloggers like this: