పదో తరగతి బాలుడు.. పబ్జీ ప్రాణం తీసింది..!

Google+ Pinterest LinkedIn Tumblr +

పబ్జీ గేమ్ ఆటల్లోనే కాకుండా నిజ జీవితంలోనూ ప్రాణాలు తీస్తుంది.. యువత ఈ గేమ్ కి బానిసలవుతున్నారు. గంటలుతరబడి గేమ్ లో మునిగిపోతున్నారు. ఇలా ఈ పబ్జీ గేమ్ కి బానిసయిన ఒక పదో తరగతి బాలుడు తన తల్లి పరీక్షలు దేగ్గర పడుతున్నాయి ఆ గేమ్ ఆడవద్దు అని మందలించడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఇక గేమ్ ని ఆడటం నిరాకరిస్తుంది అని ఉద్వేగానికి గురయ్యినా ఆ బాలుడు ఫ్యాన్ కి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

వివరాల్లోకి వెళితే.. కాలకూరి భరత్‌రాజ్, ఉమాదేవి దంపతులు మల్కాజ్‌గిరి విష్ణుపురి ఎక్స్‌టెన్షన్ కాలనీలో నివసిస్తున్నారు. వీరికి అమ్మాయి, అబ్బాయి సంతానం. కుమార్తె లాహిరి ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుండగా, కుమారుడు సాంబశివ ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు రాస్తున్నాడు. బుధవారం ఆఖరి పరీక్ష రాయాల్సి ఉంది. సోమవారం రాత్రి తల్లి సెల్‌ఫోన్ తీసుకుని పబ్‌జీ గేమ్ ఆడుతూ కనిపించాడు. పరీక్షలు పూర్తయ్యే వరకు ఆటలకు దూరంగా ఉండాలంటే ఉమాదేవి గట్టిగా మందలించింది. దీంతో అమ్మపై అలిగిన బాలుడు గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు. ఇక అరగంట తరువాత తల్లి బాలుడు ఏం చేస్తున్నాడో అని కిటికీ లో నుండి తొంగి చూసేసరికి బాలుడు చలనం లేకుండా పిలుస్తుంటే పలుకాకుండా కింద పది ఉన్నాడు. తల్లి స్టానికుల సహాయంతో దొరు పగులగొట్టి బాలుడిని వెంటనే ఆసుపత్రికి తరలించింది. ఆసుపత్రి యాజమాన్యం ఆ బాలుడిని పరిశీలించి అప్పుడికే ప్రాణాలు కోల్పోయినట్టు నిర్దారించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

tenth class student suicide because of PUBG game

ఇక ఈ విషయం ఇలా ఉంటే గత కొంత కాలంగా పబ్జీ పాలిట పది ప్రాణాలు విడుస్తున్న వారి సంఖ్య ఎక్కువవుతుంది..! పక్కన ఏం జరుగుతున్నా వీరికి పట్టడం లేదు. మొన్న ఇద్దరు యువకులు రైలు పట్టాల మీద కూర్చొని గేమ్ లో మునిగిపోయారు.. పక్కన రైలు వేగంగా పెద్ద శబ్ధం చేస్తూ వస్తున్నప్పటికీ వీరికి తెలియలేదు ఇద్దరినీ రైలు గుద్దెసుకుంటూ వెళ్లిపోయింది అక్కడికక్కడే మృతి చెందారు. ఇక అంతకు ముందు ఒక వ్యక్తి పబ్జీ ఆడుతూ పక్కనున్న యాసిడ్ తాగేశాడు. ఇలా ఎంతో మంది ఈ పబ్జీ కి బానిసలైపోయి ప్రాణాలనే పణంగా పెడుతున్నారు.. ఆట మత్తులో మునిగిపోయి ప్రాణాలు కోల్పోతున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: