రాష్ట్రాన్ని మీరు చూసుకోండి.. కుప్పం ని నేను చూసుకుంటా..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల తేదీ దేగ్గర పడుతుండటంతో ప్రచారాల స్పీడ్ పెంచారు. అలుపుఎరగకుండా రేయింబవళ్లు పార్టీ ప్రచారల్లో బిజీగా ఉంటున్నారు. రాష్ట్రంలో ప్రతి జిల్లాని సగానికిపైగా నియోజకవరగాలని కవర్ చేయాలనేదే ఆయన టార్గెట్. ఇక రోజు బిజీ షెడ్యూల్ లో ఆయన ప్రచారాలు చేస్తున్నారు ఇక ఆయన సొంత నియోజకవర్గం కుప్పంలో ఆయన ప్రత్యేకంగా ప్రచారం చేయలేని తరుణం లో ఆయన భార్య నారా భువనేశ్వరి అక్కడి పార్టీ పనులు పరోక్షంగా చూసుకుంటుందనే చెప్పొచ్చు. మొన్న ఆయన నామినేషన్ కి కూడా భువనేశ్వరి చేతులమీదగా ఇవ్వాలని భావించింది. ఇక నేడు ఆమె కుప్పం టీడీపీ కార్యకర్తలు దాదాపుగా 2000 మందితో టెలీకానఫరెన్స్ లో మాట్లాడింది.

కుప్పం నియోజకవరగం కార్యకర్తల జోష్ పెంచింది భువనేశ్వరీ. ఆమె నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ లో ఆమె మాట్లాడుతూ.. పోలింగ్‌కు దగ్గరపడుతోంది.. నేతలంతా ప్రచారంలో దూకుడు పెంచాలన్నారు. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబుకు లక్షా 20వేలు ఓట్లు ఆధిక్యం వచ్చేలా కష్టపడాలన్నారు. ఈగోను పక్కనపెట్టి కార్యకర్తలు, నేతలంతా కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. 2014లో 63 శాతం ఓట్లతో ఫస్ట్ క్లాసులో పాస్ చేశారంటున్నారు భువనేశ్వరి. ఈసారి 75 శాతం ఓట్లతో డిస్టింక్షన్‌లో పాస్ చేయాలన్నారు. 1.20 లక్షల ఓట్ల మెజారిటీ సాధించాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా ప్రచారంలో బిజీగా ఉన్నారని.. కుప్పంలో పార్టీ పరంగా ఏ అవసరం ఉన్నా కార్యకర్తలు తనను సంప్రదించాలని సూచించారు.. ఈ ఐదేళ్లలో మిగిలిన అభివృద్ధి పనులను దగ్గరుండి చేయించుకుందామన్నారు. కుప్పం నియోజకవర్గంలో స్టార్ క్యాంపెయినర్ల ప్రచారం అవసరం లేదని..తనకు కుప్పం ప్రజలపై, నేతలపై బాగా నమ్మకముందన్నారు. టెలీకాన్ఫరెన్స్‌లో భువనేశ్వరి మండలాల వారీగా పోలింగ్‌ బూత్‌ల స్థితిగతులను అంకెలతో సహా వివరించడంతో నేతలు ఆశ్చర్యపోయారు. ఆమె టెలీకాన్ఫరెన్స్ లో మాట్లాడినా తీరుతో అక్కడి ప్రజల జోష్ పెరిగందని తెలుస్తుంది.

Share.

Comments are closed.

%d bloggers like this: