తన కోరిక తీర్చమని అడిగాడు..! యువతికి స్విగ్గీ 200 ఇచ్చింది..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఫుడ్ డెలివరీ బాయ్స్ పై ఫిర్యాదులు ఆరోపణలు పెరిగిపోతున్నాయి. కస్టమర్ ఫుడ్ ఆర్డర్ చేస్తే దారిలో ఆ ఫుడ్ ని తినేయడం మనం చూశాం. కామన్ గా అయితే డెలివరీ లెట్ అయ్యిందని, ఫుడ్ పాడైపోయిందని ఫిర్యాదులు ఇస్తుంటారు.. కానీ బెంగళూరుకు చెందిన ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు అస్సలు ఊహించలేరు. ఫుడ్ డెలివరికి వచ్చిన వ్యక్తి తనతో అసభ్యకరంగా మాట్లాడాడని తన కోరిక తీర్చమంటు వింతగా ప్రవర్తిస్తూ తనని అడిగాడని ఆ యువతి సోషల్ మీడియా లో పేర్కొంది. ఈ విషయమై తాను స్విగ్గీ లో కాంప్లెయింట్ పోడ్త్ చేస్తే స్విగ్గీ యాజమాన్యం తనకి సారీ చెబుతూ నష్టపరిహారం కింద 200 కూపన్ ఇచ్చారని ఇది చాలా బాధాకరం అని ఆమె పేర్కొంది.

వివరాల్లోకి వెళితే.. బెంగళూరు కి చెందిన స్వేత యక్తుంగ్మా అనే యువతి బెంగళూరు లో ఒక అపార్ట్మెంట్ లో ఒంటరిగా ఉంటుంది. ఇక ఆమె మార్చి 28 న రాత్రి సుమారు 10.20 గంటలకి స్విగ్గీ లో ఫుడ్ ఆర్డర్ చేసింది. ఇలా తాను రాత్రి పుటా చాలా సార్లు ఆర్డర్ చేసేది. ఇక ఈసారి కూడా ఇలా రాత్రి ఫుడ్ ని ఆర్డర్ చేసింది. ఇక డెలివరీ బాయ్ తనకి ఫోన్ చేసి అడ్రెస్ అడగగా తనకి అడ్రెస్ గైడ్ చేసింది. తన డోర్ బెల్ కొట్టగానే ఫోన్ చూస్తూ వెళ్ళి ఆర్డర్ కలెక్ట్ చేసుకుంటుంది. ఇక ఆ వ్యక్తి ఏదో అంటునట్టు ఈమెకి అనిపించింది.. సాధారణంగా 5 స్టార్ రేటింగ్ ఇవ్వమంటూ బాయ్స్ అడుగుతారు ఇక ఆమె ఆ వ్యక్తి కూడా అదే అడుగుతున్నాడు అనుకోని ఒకే ఆనింది ఇక ఆ వ్యక్తి కాస్త వింతగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. ఆర్డర్ బాక్స్ ని గట్టిగా పట్టుకొని ఆ యువతికి ఇవ్వకుండా తన కోరికని తీర్చమంటూ అడిగాడు. వెంటనే ఆ యువతి విని విననట్టుగా చేసి తన ఆర్డర్ బాక్స్ ని గట్టిగా లాగుకొని డోర్ ని తన ముఖం పై గట్టిగా వేసింది. డోర్ కొంత సేపు వేసినప్పటికీ ఆ యువతికి ఇంకా భయం తగ్గలేదట..!

ఇక కాసేపు భయం తో వానికి పోయింది. భయపడుతూనే ఈ విషయాన్ని గురించి స్విగ్గీ యాజమాన్యానికి ఫిర్యాదు చేయగా వాళ్ళు సారి చెబుతూ.. 200 రూపాయల కూపన్ తనకి ఇచ్చారు. ఇక ఆమెకి చాలా బాధ వేసింది. ఇక ఈ విషయాన్ని రెండు రోజులు ఆగి తన ఫేస్‌బుక్ ద్వారా పోస్ట్ చేసింది ఇలాంటి ఘటన తనతో జరిగిందని తనతోనే జరిగిందంటే ఇంకా చాలా మందితో జరిగే అవకాశం ఉందని ఈ విషయం పై తగిన చర్య తీసుకోవాలని తెలియజేస్తూ పోస్ట్ చేసింది. దీని పై స్పందిస్తూ వెంటనే కటిన చర్య తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Share.

Comments are closed.

%d bloggers like this: