కట్టుకున్న భార్యని ఉరేసి కట్టెలతో కాల్చిన కిరాతకుడు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రేమించి పెళ్లి చేసుకున్నా భర్తే ఆ భార్య పాలిట యముడిలా మారాడు.. పెళ్లయ్యి మూడు నెల్లలు కూడా అవ్వలేదు ఆ భార్యని పొట్టన బెట్టుకున్నాడు. అతని బంధువు స్నేహితుడితో కలిసి ఆమెని చంపి శవాన్ని కాల్చేశాడు ఈ ఘటన కొమురం భీం జిల్లా జైనూరు మండలంలో కోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. కొమురం భీం జిల్లా జైనూర్ మండలంలోని భూషి మెట్ట గ్రామానికి చెందిన ఆత్రం సాగర్ బాయి ,అదే గ్రామానికి చెందిన మర్సు కోల మాధవ్ రావ్ మూడేళ్ళుగా ప్రేమించుకునన్నారు, సాగర్ బాయితో ప్రేమ వ్యవహారం నడిపిన మాధవ్ రావ్ ఆమెకి తెలియకుండా మామడ గ్రామానికి చెందిన తన మేనత్త కూతురుతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు, ఈ విషయం సాగర్ బాయి కి తెలియడంతో గ్రామంలో పంచాయితీ నిర్వహించారు, దింతో రెండు నెలల క్రితం సాగర్ బాయికి మాధవ్ రావ్ కి పెళ్లి జరిగింది.

కొద్దీ రోజులు మాధవ్ రావ్ అత్త గారి ఇంట్లో ఉంటూ సాగర్ బాయి తో సక్రమంగా కలిసి ఉన్నాడు, ఆ తర్వాత తన స్వంత ఇంటికి వెళ్లిన మాధవ్ రావ్ అక్రమ సంబంధం ఉన్న మహిళను ఇంటికి తీసుకు వచ్చాడు, విషయం భార్య సాగర్ బాయికి తెలియడంతో పంచాయతీ పెద్దలతో పాటు పోలీస్ లను ఆశ్రయించింది, దింతో కక్ష పెంచుకున్న మాధవ్ రావ్ భార్యను ఎలాగైనా చంపాలని ప్లాన్ వేసుకున్నాడు, ప్లాన్ ప్రకారం గ్రామంలో పెళ్లి వేడుకలు జరుగుతుండగా మాధవ్ రావ్, సాగర్ బాయి కి పోన్ చేసి పిలిపించుకున్నాడు, మాయ మాటలు చెప్పి మాట్లాడుకుందామని మాధవ్ రావ్ భార్యతో పాటు బందువు దత్తు, స్నేహితుడు నాగో రావ్ తో కలిసి ఊరు బయటకు తీసుకెళ్లాడు, ముగ్గురు కలిసి ఉరి వేసి చంపి అనంతరం కట్టెలు పోగు చేసి ఆనవాళ్లు దొరక్కుండా శవాన్ని దహనం చేశారు, ఏమి ఎరుగనట్టు ఊర్లోకి వచ్చి పెళ్లి వేడుకల్లో నిమగ్నమయ్యారు, అయితే ఇంటి నుండి వెళ్లిన సావిత్రి బాయి నాలుగు రోజులుగా కనిపించకుండా పోవడం తో తల్లిదండ్రులు పోలీస్ లకు పిర్యాదు చేసారు, మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీస్ లు దర్యాప్తు చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది, దింతో నిందితులను పోలీస్ లు అరెస్టు చేశారు,

Share.

Comments are closed.

%d bloggers like this: