ఎస్‌పీవై రెడ్డి కి అస్వస్థత…! షాక్ లో జనసేన..!

Google+ Pinterest LinkedIn Tumblr +

నంద్యాల సిట్టింగ్ ఎంపీ.. జనసేన పార్టీ అభ్యర్థి ఎస్‌పి‌వై రెడ్డి అస్వస్థత కి గురయ్యారు. ఎన్నికలు దేగ్గరకి వచ్చేశాయి ఇలాంటి పరిస్థితులలో ఆయన అస్వస్తతకి గురవ్వడం అంత సరైన సూచన కాదు అనే చెప్పాలి. ఇక ఎస్‌పి‌వై రెడ్డి అస్వస్థతకి గురవ్వడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆయనని హుటాహుటిన హైదరబాద్ కి తరలించారు. గత ఎన్నికల్లో ఈయన వైసీపీ నుండి గెలిచి ప్రమాణ స్వీకారం కాకముందే టీడీపీ లోకి చేరారు.

అప్పటినుండి టీడీపీ లోనే ఉంటున్నారు.. అయితే గత కొంత కాలాంగా ఈయన ఆరోగ్య పరిస్థితి సరిగా లేదు పార్టీ లో కూడా ఈయన అంతా యాక్టివ్ గా లేరు అని టీడీపీ భావించింది. నియోజకవారిగా నిర్వహించిన సర్వే లో ఈయనకి అంతా అనుకూలత కనిపించకపోయేసరికి టీడీపీ ఈసారి ఈయనకి మొండి చేయి చూపించింది. ఇక టీడీపీ టికెట్ ఇవ్వకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడాలని ఈయన భావించాడు. ఇదే సమయం లో జనసేన ఈయని క్యాచ్ చేసింది.. నంద్యాల నుండి ఎస్‌పి‌వై రెడ్డి ని బరిలోకి దింపింది. ఇంతే కాకుండా ఈయన కుటుంబ సభ్యులకి మరో రెండు టికెట్లు కూడా ఇచ్చాడు పవన్. ఎస్‌పి‌వై రెడ్డి పై పవన్ కి ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇక ప్రస్తుతం అయితే ఎస్‌పి‌వై రెడ్డి ఆరోగ్యం సరిగా లేదు ఇక ఆయన త్వరగా కొల్కోని తిరిగి పార్టీ ప్రచారం లో పాల్గొనాలని జనసేన శ్రేణులు భావిస్తున్నాయి.

Share.

Comments are closed.

%d bloggers like this: