మోదీకి అరుదైన పురస్కారం..! జయాద్ మెడల్ ప్రకటించారు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

దేశ ప్రధాని మోదీ కి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆ దేశపు అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించింది. ఉనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క అతున్నత పురస్కారం జయాద్ మెడల్. ఆ దేశ అధ్యక్షుడు పేరు మీదే ఈ పురస్కారం ఉంది. ఆ దేశ అధ్యక్షుడు ఖలీఫా బిన్ జయాద్ పేరిట ప్రతి సంవత్సరం ఆ దేశస్తులకి ఆ దేశానికి సహకరించిన వ్యక్తులకి ఈ పురస్కారం ఇచ్చి సమ్మనిస్తారు. అయితే ఈ పురస్కారాన్ని ఆ దేశ అధ్యక్షుడు ప్రధాని మోదీ కి ప్రకటించడం గమనార్హం.

భారత్ యూ‌ఏ‌ఈ ల మధ్య మంచి సంబంధాకు ఉన్నాయి.. ఈ సంబంధాలకి మోదీ ఎంతగానో దోహదపడినందుకు ఇరు దెఃశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మోదీ బలపరిచినందుకు ఆ దేశ అధ్యక్షుడు ఖలీఫా బిన్ జయాద్ మోడీకి ఈ పురస్కారం ప్రకటించాడు. ఈ పురస్కారం తో దేశానికె ఒక మంచి గుర్తింపు గౌరవం వచ్చిందని అంటున్నారు బీజేపీ వర్గాలు. ఈ అత్యున్నత పురస్కారం అందుకున్న తొలి భారత ప్రధాని మోదీ ఏ కావడం విశేషం. గతంలో బ్రిటన్ రాణి ఎలిజబెత్-2, రష్యా అధ్యక్షుడు పుతిన్, అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్.డబ్ల్యూ. బుష్, ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ, జర్మనీ ఛాన్స్ లర్ ఏంజెలా మెర్కల్ తదితరులు మాత్రమే అందుకున్నారు. తాజాగా వీరి సరన ప్రధాని మోదీ చేరారు.

Share.

Comments are closed.

%d bloggers like this: