మళ్ళీ అవకాశం ఇస్తే శక్తి వంచన లేకుండా పని చేస్తా..!-కవిత

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలంగాణ నిజామాబాద్ ఎంపీ కవిత ప్రచారం పనుల్లో బిజీగా ఉన్నారు. ప్రచారంలో భాగంగా గురువారం నాడు నిజామాబాద్ జక్రాన్ పల్లి లో ఆమె రోడ్ షో నిర్వహించారు.. రానున్న రోజుల్లో తాము నిజామాబాద్ కొరకు ఏం చేయబోతున్నారో ప్రజలతో ఆమె వివరించారు. పలు సఙ్క్శెమ్ పథకాల గురించి నిజామాబాద్ అభివృద్ది పనుల గురించి ఆమె కార్యకర్తలతో ప్రజలతో పంచుకున్నారు.

కవిత మాట్లాడుతూ.. రెండో సారి కేసీఆర్ ను సీఎం చేసినందుకు మీకు ఏమిచ్చి రుణం తీసుకోవాలో తెలియట్లేదు.. ఏ పథకం పెట్టినా ఎంతో ఆలోచించి ప్రవేశ పెడుతున్నాం అని ఆమె అన్నారు. పీఎఫ్ కార్డు ఉన్న బీడీ కార్మికులు ప్రతి ఒక్కరికి మే నుంచి రూ.2 ఫించన్లు వస్తాయి అని ఆమె హామీ ఇచ్చారు. గతంలో కిస్తీలు ఇవ్వక పోతే ఇళ్ళు దర్వాజలు పిక్కపోయేవారు. కానీ టీఆరెస్ ప్రభుత్వం ప్రతి పైసా కిస్తిగా ఇస్తుంది అని ఆమె గుర్తు చేశారు. ఇల్లు కట్టుకునేందుకు రుణాలని ప్రభుత్వం ఇస్తుంది అని ఆమె అన్నారు.

వచ్చే రెండేళ్లలో ప్రతి గ్రామంలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేపడతాం ప్రతి గ్రామానికి ప్రతి పెద వాడికి ఇల్లు అందేలా చూస్తాం అని ఆమె హామీ ఇచ్చారు. డ్వాక్రా గ్రూపుల ద్వారా వ్యవసాయ ఉత్పత్తులను తయారు చేయిస్తాం.. ఎయిర్ పోర్ట్ కోసం 800 ఎకరాల భూమి చూశాం.. జక్రాన్ పల్లిలో రానున్న రోజుల్లో ఎయిపోర్టు వస్తుంది అని ఆమె తెలియజేశారు.

ఐటి హబ్ పనులు నిజామాబాద్ లో వేగంగా జరుగుతున్నాయి… రానున్న తరం కోసం పనిచేస్తున్నాం.. పాస్‌బుక్కులు రాని కొన్ని గ్రామాలున్నాయి… త్వరలోనే పాస్ బుక్ లు అందరికీ వస్తాయి అని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఏ ఆధారం లేని ప్రజల కోసం వంద శాతం సబ్సిడీ కింద రూ.50 వేలు రుణాలు ఇచ్చాము.. మళ్ళీ ఎంపీగా నాకు అవకాశం ఇస్తే శక్తి వంచన లేకుండా పని చేస్తా..! ఈసారి ఎక్కువ మంది బరిలో ఉన్నారు. మొదటి ఈవిఎంలో రెండో నెంబర్ మీద కారు గుర్తు ఉంటుంది అని ఆమె ప్రజలకి చెప్పారు.

Share.

Comments are closed.

%d bloggers like this: