జగన్ ‘నవరత్నాలని’ ప్రజలతో పంచుకున్న భారతి..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఒక పక్క చంద్రబాబు మరో పక్క జగన్ రాష్ట్రంలో ఇద్దరూ మెరుపు ప్రచారల్లో నిమగ్నమై ఉన్నారు. ఇక వీరే కాకుండా వీరి సతీమనులు కూడా పార్టీ ప్రచారల్లో పాల్గొని కార్యకర్తల్లో కొత్త జోష్ ని నింపుతున్నారు. అధినేతలిద్దరూ రాష్ట్రం లో వివిదల్ జిల్లాలకి వెళ్ళి ప్రచారాలు చేస్తుంటే వీరి సతీమనులు అధినేతల నియోజకవర్గాలకి వెళ్ళి అక్కడ స్పెషల్ గా శ్రద్ధా వహిస్తున్నారు. ఈ క్రమంలో మొన్న చంద్రబాబు భార్య భువనేశ్వరి కుప్పం నియోజకవర్గ కార్యకర్తలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇక నేడు జగన్ భార్య భారతి డైరెక్ట్ గా కడప జిల్లా వేంపల్లి చేరుకున్నారు జగన్ భార్య భారతి కడప ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి భార్య సమతారెడ్డి ఇద్దరు కలిసి కడప వేంపల్లి లో ప్రచారం లో పాల్గొన్నారు.

ప్రజల కష్టాలు తనకు తెలుసు అని వైసీపీ అధినేత వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి అన్నారు. వచ్చే ఎన్నికల్లో పులివెందల అసెంబ్లీ అభ్యర్థిగా పోటీచేస్తున్న జగన్, ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డిలను గెలిపించాలని ఆమె కోరారు. అనంతరం ఆమె వేంపల్లిలోని కొందరు మహిళలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ అయిదేళ్లలో ఎవరికీ ఇళ్లు మంజూరు కాలేదని అన్నారు. మహిళలు సంతోషంగా ఉండాలనేది జగన్‌ ఆకాంక్ష అని, వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మహిళల పేరుతోనే పట్టాలు ఇస్తామని చెప్పారు.

అలాగే పిల్లలను ఎల్‌కేజీ నుంచి పీజీ వరకూ చదివించడానికి జగన్‌ అండగా నిలుస్తామని చెప్పారు. విధ్యార్థులకి అమ్మ వాడి పథకం ద్వారా సంవత్సరానికి 15 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆరోగ్యశృ పథకాన్ని గురించి వాళ్ళతో చెప్పారు. ఆసుపత్రిలో 1000 రూపాయలకి పైగా ఎంత ఖర్చు వచ్చినా ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వమే భరిస్తుందని ఆమె అన్నారు. డ్వాక్రా మహిళలకు పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తామని చెప్పారని అన్నారు. వైఎస్సార్‌ ఆసరా పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీలకు నాలుగు దఫాలుగా రూ.75వేలు ఇస్తామని ఆమె నవరత్నాల పథకాల గురించి వివరిస్తూ వచ్చారు. కంద్రబాబు మాయ మాటలు చెప్పి మోసాలు చేస్తాడని ఆ మోసాలు మాయ మాటలు ప్రజలు నమ్మొద్దని ఆమె అన్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ అధినేత గెలుపుకి అందరూ తమ సహాయ సహకారాలు అందించాలని ఆమె కోరారు. జగన్ ను గెలిపించాలని ఆమె ప్రజలకి విజ్ఞప్తి చేశారు.

Share.

Comments are closed.

%d bloggers like this: