పవన్ కొరకు వరుణ్ బన్నీ..! గ్లాసు కి మెగా హీరోల మేకప్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

సినిమా హీరోగా తనకంటూ ప్రత్యేక క్రేజ్‌, అభిమాన గణాన్ని సంపాదించుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. జనసేన పార్టీని స్థాపించి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చిన జనసేనాని, ఆ తరవాత తెగతెంపులు చేసుకుని ప్రస్తుతం ఎన్నికల్లో ఒంటరిగా పోటీకి దిగారు. వాస్తవానికి ఏడాది క్రితం నుంచే పవన్ కళ్యాణ్ జనంలో మమేకమయ్యారు. ఉత్తరాంధ్ర నుంచి ప్రజా పోరాట యాత్రను మొదలుపెట్టి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఇక నోటిఫికేషన్ వెలువడిన తరవాత ఎన్నికల ప్రచారంలో వేగం పెంచారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక మంచి నటుడు భారీ సంఖ్యలో రాష్ట్రం లోనే అత్యంత ప్రేక్షకాధరన పొందిన స్టార్. సినీ రంగంలోనే కాకుండా సామాజిక విలువలు ఉన్న వ్యక్తి కూడా.. ఇక సమాజానికి ఎలాగైనా మంచి చేయాలని మెరుగైన అధికారాన్ని అందించాలని భావించి 2014 లో జనసేన పార్టీ స్థాపించారు. అన్న చిరంజీవి తరహాలో ఈయన కూడా సినిమాలని పూర్తిగా పక్కన పెట్టి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 2014 లో టీడీపీ కి మద్దత్తు తెలుపుతూ ఆ పార్టీ తరఫున ప్రచారం చేసి చంద్రబాబుకి మరింత మెజారిటీ తీసుకొచ్చాడు.

ఇక ఆ తరువాత చంద్రబాబు తో తెగదెంపులు చేసి ప్రత్యేక హోదా అనే అంశం తో పోరాటాలు చేసి జనం లోకి వచ్చారు. ఇక ఈసారి జరగబోయే ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం, బీఎస్పీ లతో పొత్తు కుదుర్చుకొని ఎన్నికల బరిలో దిగనున్నారు. అయితే పవన్ కళ్యాణ్ మెగా కుటుంబానికి చెందిన వ్యక్తి.. కుటుంబంలో ఎందరో సెలబ్రిటీలు స్టార్ లు ఉన్నప్పటికీ ఎవ్వరి సహాయం తీసుకోకుండా ఒంటరిగా ప్రచారం చేస్తున్నాడు. తాజాగా ఆయన అన్న నాగబాబు రాకతో పార్టీ లో కొంత ఉత్సాహం పవన్ కి కొంత ఆత్మ స్థైర్యం చేకురాయి. మిగితా అన్నీ పార్టీల్లో నేతలు స్టార్ కేంపెయినర్లని, సినీ నటులని వారి కుటుంబ సభ్యులని ఇప్పటికే ప్రచార బరిలో దింపారు. కానీ జనసేనాని మాత్రం ఒంటరిగా నేనొక్కడినే అన్న రీతిలో ముందుకు సాగుతున్నాడు.

ఇక నాగబాబు రాకతో ఆయన సతీమణి ఆయన కూతురు నీహారిక కొణిదెల ప్రచారం లో పాల్గొన్నారు, దీంతో పార్టీకి కొంత కుటుంబ కల వచ్చింది అనే చెప్పాలి. ఇక రామ్ చరణ్ కూడా తన ట్విట్టర్ ఫేస్ బుక్ ఖాతాల ద్వారా తన బాబాయి పవన్ కి అనుకూలంగా గ్లాసు గుర్తుకి ఓటు వేయాలంటూ పోస్టులు చేశాడు. తన కాలికి గాయం అవ్వడం తో ఆయన డైరెక్ట్ గా ప్రచారం చేయలేకపోతున్నారు పైగా RRR షూటింగ్ తనని అడ్డగించాయి. ఇకపోతే నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ బన్నీ ధరం తేజ్ లు ఉన్నారు. ఇక వీరు వచ్చి ప్రచారం లో పాల్గొంటే జనసేన కి యువత ఓట్లు పెరిగే అవకాశం పుష్కలంగా ఉంటుంది.

ఇక తాజాగా నాగబాబు సతీమణి జనసైనికులకి మెగా అభిమానులకి ఇలాంటి తీపి కబురు అందించింది. . వరుణ్ తేజ్, అల్లు అర్జున్ ఎన్నికల ప్రచారానికి వస్తారని ఖరారు చేశారు. వరుణ్ తేజ్ ఏప్రిల్ 5న అమెరికా నుంచి తిరిగొస్తారని.. ఆ తరవాత ఆయన, బన్నీ కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని వెల్లడించారు. ఈ మేరకు ఓ యూట్యూబ్ ఛానెల్‌‌ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ ఈ విషయం చెప్పారు. బన్నీ కి ప్రచారం కొత్తేమీ కాదు తన తండ్రి అల్లు అరవింద్ గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు అల్లు అరవింద్ అనకాపల్లి నుండి బరిలోకి దిగారు. అప్పుడు బన్నీ తన తండ్రి నియోజకవర్గం లో పంచ్ డైలాగ్స్ వేస్తూ ఓటర్లని ఆకర్షించే విదంగా ప్రచారం చేశారు. కానీ వరుణ్ కి మాత్రం ఇదే మొదటిసారి ఇక ఈ ఇద్దరు యువ హీరోలు ఓటర్లని ఎలా ఆకర్షిస్తారో వారి ప్రచారం ఎలా ఉండబోతుందో.

Share.

Comments are closed.

%d bloggers like this: