జగన్ కనుసన్నలో ఎన్నికల సంఘం పనిచేస్తుంది- సీఎం రమేశ్

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై కేంద్రం కన్నెసింది అనడంలో ఎటువంటి అతిశెయోక్తి లేదు. కేంద్రం కన్నెయ్యడమే కాదు టీడీపీ పై కన్నెర్రజేసింది. కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ టీడీపీ నేతల ఇళ్ల పై వారికి సంబంధించిన ఆఫీసులపై కాలేజీలపై తనికీలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే చాలా మంది టీడీపీ నేతలపై ఐటీ దాడులు జరిగాయి ఎన్నికల వేల ఇలా జరగడంతో రాజకీయ వేడి బగ్గుమంటుంది. ఇది కేంద్రం చేస్తున్న కుట్రనా..? లేక ప్రతి పక్షాలు కేంద్రంతో కలిసి చేస్తున్న రాజకీయమా అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఈ క్రమం లో నేడు ఉదయం తెల్లవారుజామునా 6 గంటల ప్రాంతం లో టీడీపీ నేత రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ ఇంటిపై ఐటీ అధికారులు సోదాలు చేశారు.

శుక్రవారం ఉదయం కడప జిల్లా పోట్లదుర్తిలోని సీఎం రమేశ్ నివాసం వద్దకు పెద్ద సంఖ్యలో పోలీసులు చేరుకున్నారు. వారిని ఎందుకు వచ్చారని ఎంపీ ప్రశ్నించగా.. తనిఖీలు చేసేందుకు వచ్చామని తెలిపారు. సెర్చ్ వారెంట్ ఉంటేనే లోపలికి అనుమతిస్తా అని సీఎం రమేశ్ స్పష్టం చేయడంతో ఎంపీకి, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.

ఇక ఈ విషయం ఇలా ఉండగా తన ఇంటిపైనే కాకుండా అధికారులు తనకి తెలిసిన వారి ఇళ్ళలో కూడా సోదాలు చేస్తునట్టు రమేశ్ ఆరోపించారు. ఈ విషయమై ఆయన విలేఖరులతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. ఉదయం ఆరు గంటలకే పోలీసులు తన ఇంటికి వచ్చారని.. తనిఖీల విషయమై తాను జిల్లా ఎస్పీతో మాట్లాడానని తెలిపారు. మా వూరు తొలి నుంచి తెలుగుదేశం పార్టీకి కంచుకోటని.. దీంతో గ్రామంలోని ప్రతి ఇంటిని పోలీసులు తనిఖీ చేస్తున్నారని సీఎం రమేశ్ ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్, విజయసాయిరెడ్డిల కనుసన్నల్లో ఎన్నికల సంఘం పనిచేస్తోందని ఆరోపించారు. చంద్రబాబు సభలకు వచ్చే స్పందన చూసి భయపడి ఎన్నికల్లో ఏ విధంగా లబ్ధి పొందాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోందని సీఎం రమేశ్ ఆరోపించారు.

Share.

Comments are closed.

%d bloggers like this: