రావేల చరిత్ర హీనుడు..! గల్లా మొనగాడు..!- బాబు

Google+ Pinterest LinkedIn Tumblr +

గుంటూరు జిల్లా లో చంద్రబాబు ప్రచారం నిర్వహించారు.. ప్రచారం లో భాగంగా గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని పెదనందిపాడులో చంద్రబాబు మాట్లాడారు.. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ని పొగుడ్తూ మరో పక్క టీడీపీ ని వీడి జనసేన లోకి వెళ్ళిన రావేల కిశోర్‌బాబు పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ‘సిగ్గు లేకుండా పార్టీ మారతావా? నీలాంటి వాళ్లు చరిత్ర హీనులుగా మిగిలిపోతారు.. పొటిటికల్‌గా నువ్వు జీరో అవుతావ్’ అని ఆయన రావేల పై తీవ్ర విమర్శలు చేశారు. మంత్రి పదవి అనుభవించి కిశోర్‌బాబు ఎన్నికల ముందు టీడీపీ మోసం చేసి వెళ్లిపోయారని ఆరోపించారు. ఇలాంటి వాళ్లకు ప్రజలే గట్టిగా బుద్ధి చెప్పాలన్నారు. ప్రత్తిపాడు టీడీపీ అభ్యర్థి డొక్కా మాణిక్య వరప్రసాద్‌ను భారీ మెజార్టీలో గెలిపించాలని కోరారు.

ఇక గల్లా జయదేవ్ గురించి మాట్లాడుతూ.. పార్లమెంటులో మోదీని మిస్టర్ పీఎం అని పిలిచిన ఏకైక మొనగాడు మగాడు గల్లా జయదేవ్ అని కొనియాడారు. జయదేవ్ మాటలకి ప్రధాని నోరు మూతపడిపోయిందని ఆయన అన్నారు. జయదేవ్ ని డైరెక్ట్ గా ఏమి చేయలేక వ్యాపారంగా దెబ్బతీద్దామని మోడి చాలా ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసిన ఎన్ని బెదిరింపులు చేసిన గల్లా బెదరలేదని ఆయన గుంటూరు ప్రజలకి తెలియజేశారు. హైదరబాద్ లాంటి మరో ఇరవై నగరాలు నిర్మించే సత్తా తనకి ఉందంటూ బాబు స్పష్టం చేశారు. డొక్కా మాణిక్య వరప్రసాద్ ను గల్లా జయదేవ్ ను గెలిపించాలని బాబు ప్రజలని కోరాడు.

Share.

Comments are closed.

%d bloggers like this: