10 గంటల్లో..! 2 దేశాలు..2 మ్యాచ్ లు..! 10 వికెట్లు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

శ్రీలంకా ఫాస్ట్ బౌలర్ మలింగ క్రికెట్ ని ఎంతగానో గౌరవిస్తాడు అనటానికి ఒక చక్కటి ఉదాహరణ చూపాడు. తన ఫిట్ నెస్ లేవల్స్ కి తనకు తానే పరీక్ష పెట్టుకొని తాను సూపర్ ఫిట్ అని చాటుకున్నాడు. కేవలం పది గంటల వ్యవధిలోనే రెండు దేశాల్లో రెండు మ్యాచు లు ఆడి పది వికెట్లు తీసి యువ ఆటగాళ్ళకి ఆదర్శంగా నిలిచాడు.. ఇదో అరుదైన రికార్డ్ అనే చెప్పాలి. ఐపీఎల్ లో ఆడుతున్న మలింగ ముంబై ఇండియన్స్ మొదటి మ్యాచ్ లో పాల్గొనలేదు దానికి కారణం తన దేశ క్రికెట్ బోర్డ్ మలింగ ని ఆడటానికి వీలు లేదని చెప్పడం.

శ్రీలంకా బోర్డ్ ప్రపంచ కప్ ఆటలు దేగ్గర పడుతున్నాయని మలింగ ఫిట్ గా ఉండాలని శ్రీలంకా లో నిర్వహించే లీగ్ మ్యాచ్ లు ఆడి తన ఫామ్ పెంచుకోవాలని ఆదేశాలు ఇచ్చింది.. కానీ లీగ్ మ్యాచ్ లకి సమయం ఉంది మ్యాచ్ మ్యాచ్ కి మధ్య తగిన సమయం ఉందని క్లారిటీ కి వచ్చి శ్రీలంక క్రికెట్ బోర్డ్ కి ఈ విషయాన్ని విన్నవించుకున్నాడు. తాను ఐపీఎల్ లో పాల్గొంటాను అని వాళ్ళతో చెప్పాడు. కుదిరినంత సమయం క్రికెట్ కి ఇస్తే ఫిట్ నెస్ తో పాటు ఆయన ఫామ్ కూడా పెరుగుతుంది అని వాళ్ళతో చెప్పాడు. లీగ్ మ్యాచ్ లకి కూడా పాల్గొంటాను అని చెప్పడంతో ఆయనకి ఐపీఎల్ ఆడటానికి అంగీకరిచ్చింది. ఇక మొన్న చెన్నై తో ఆడిన మలింగ నాలుగోవర్లలో 3/34 తీసి తన సత్తా చాటాడు. ఇక అర్ధరాత్రి 1.40కి ఇండియాలో బయల్దేరి తెల్లవారుజామున 4.30కి శ్రీలంక చేరుకున్నాడు. ఉదయం 9.45 గంటలకు వన్డే సూపర్ ఫోర్ టోర్నీలో ఆడాడు. ఈ మ్యాచ్ లో 49 పరుగులిచ్చి 7 వికెట్లు కూల్చాడు. ఇక మలింగ ప్రదర్శన, కమిట్మెంట్ చూసి క్రికెట్ దిగ్గజాలు ఆయన పై ప్రశంసలు కురిపిస్తున్నారు యువ తరాలకి మలింగ ఆదర్శంగా మారాడు అని ఆయనకి కితాబిచ్చారు.

Share.

Comments are closed.

%d bloggers like this: