నిర్మాతగా మారిన మలయాళీ బ్యూటీ..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఇద్దరమ్మాయిలతో సినిమాలో కోమలి గా మత్తెక్కించిన మలయాళం బ్యూటీ అమలా పాల్ ఇప్పుడు నిర్మాత అవతారం ఎత్తింది. ఆమెకి ఎప్పటినుండో నిర్మాతగా మారాలని కోరికగా ఉందట..! అయితే తాజాగా ఒక యువ దర్శకుడు అనూప్ ఆమెకి కథ చెప్పాడట.. ఇప్పటికే ఈ కథ చాలా మంది ప్రొడ్యూసర్స్ దేగ్గరికి వెల్లిందట అయిన ఎవ్వరూ ఒప్పుకోలేదు కానీ ఈ కోమలి కథ విన్న మొదటి సారె కథ ఎంతగానో నచ్చేసి కథకి ఒకే చెప్పేసిందట.

కథ ఒక సస్పెన్స్ త్రిల్లర్.. మంచి భావోద్వేగాలకి గురి చేసే కథ అని సమాచారం. కేరళ లో ఈ సినిమా ని లాంచ్ చేశారు. అమల పాల్ మ్యానేజర్ కూడా ఈ సినిమాకి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.. సాధారణంగా కథానాయికలు నిర్మాతగా మారటం చాలా రేర్..! కొందరే కథానాయికలు నిర్మాతలుగా మారుతారు.. బాలి వుడ్ లో భారత కెప్టెన్ విరాట్ కోహిలి భార్య అనుష్క శర్మా ఇది వరకే దాదాపుగా 3 సినిమాలని నిర్మించింది. ఇప్పుడు అమల పాల్ కూడా నిర్మాతగా మారనున్నారు. ఇక చూడాలి ఆమెకి కథ సక్సెస్ ఇస్తుందో లేదో..!

Share.

Comments are closed.

%d bloggers like this: