13 బంతుల్లో 48 రన్లు..! ఆండ్రీ రసెల్ భయంకర ప్రదర్శన..!

Google+ Pinterest LinkedIn Tumblr +

వరుసగా నాలుగు మ్యాచ్ లు ఓడిపోయిన బెంగళూరు టీమ్‌ నిన్న కోల్కతా తో తలపడింది. టాస్ గెలిచిన కోల్కతా ముందు బౌలింగ్ ని ఎంచుకుంది. ఇది వరకు కంటే నయంగా బెంగళూరు 205 రన్ల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ విరాట్ కోహిలి 49 బంతుల్లో 84 రన్లు డివిలియర్స్ 32 బంతుల్లో 63 పరుగులు చేశారు. ఇక వీరిద్దరి చక్కటి ప్రదర్శనతో బెంగళూరు 3 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. 206 రన్ల భారీ లక్ష్యం తో కోల్కతా బరిలోకి దిగింది. ఓపెనర్ క్రిస్ లిన్ 43 పరుగులుచేయగా రాబిన్ ఊతప్ప నిశిత్ రాణాలు 33, 37 పరుగులు తీశారు ఈ దిశలో కోల్కతా అప్పటికే 4 వికెట్లు కోల్పోయింది స్కోర్ కూడా పెద్దగా ఏమి చేయలేకపోయారు. అందరూ బెంగళూరు మ్యాచ్ గెలవబోతుంది అనే అనుకున్నారు బంతులు తక్కువ ఉన్నాయి పరుగులు ఎక్కువ చేయాలి. ఇక ఆపై వచ్చిన దినేష్ కార్తీక్ 19 పరుగులకే ఔట్ అయ్యాడు.. ఇక ఆర్సీబీ ఫ్యాన్స్ కి గెలుపు కాయం అనిపించింది.

అందరూ ఆర్సీబీ అని అరుస్తున్నారు ఆ సమయంలో కోల్కతా పవర్ హిట్టర్ సిక్సుల వీరుడు ఆండ్రీ రసెల్ గ్రౌండ్ లోకి వచ్చాడు. ఆయన గతంలో కూడా హైదరబాద్ పై పంజాబ్ పై ఇలాంటి సమయం లోనే వచ్చి 18 బంతుల్లో 48 పరుగులు 19 బంతుల్లో 47 పరుగులు తీసి తన సత్తా చాటుకున్నాడు. ఇక కోల్కతా ఫ్యాన్స్ కి మాత్రం ఇంకా గెలుపు పై నమ్మకం ఉంది. 20 బంతుల్లో 68 పరుగులు తీయాల్సి ఉంది. ఇలాంటి సమయంలో ఆండ్రీ రసెల్ తన సత్తా చాటుకున్నాడు. బెంగళూరు బౌలర్లు చెత్త ప్రదర్శన కంటిన్యూ చేశారు రసెల్ చిత్తు ప్రదర్శన చేశాడు.. బంతులని చితకా బాదాడు.. బౌలింగ్ చేయాలంటేనే భయం పట్టుకునేలా చేశాడు వేసిన ప్రతి బంటి సిక్స్ ఫోర్ తప్ప మరొకటి లేదు.. ఒక ఓవర్ 18 వ ఓవర్ లో 0, 0, Wd, 6Nb, 6 ,6 ,Wd, 1, 1 తో కలిపి 23 రాన్లు బాదారు.. బౌలర్ మొహ్మద్ సిరాజ్ ప్రెషర్ కి గురయ్యి ఒక నోబ్ బాల్ వేసాదు అంపైర్ అప్పటికే వార్నింగ్ ఇచ్చాడు తదుపరి బంతే బౌలర్ ముఖం ఎట్టుకి ఫుల్తాస్ వేసి బౌలింగ్ నుంచి తప్పుకున్నాడు.. ఇక ఆ ఓవర్ లో 23 పరుగులు వచ్చాయి.. మ్యాచ్ దిశ మారిపోయింది. ఇక మరో ఓవర్ లో కివీస్ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథి నేనెందుకు సమర్పించుకోవద్దు అనే రీతి లో 1, 6, 6, 6, 4, 6 తో కలిపి 29 పరుగులిచ్చాడు.. మరో ఓవర్ మిగులుండగానే కోల్కతా మ్యాచ్ గెలిచేసింది. ఆండ్రీ రసెల్ అద్భుతమైన ప్రదర్శనతో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు కేవలం 13 బంతుల్లోనే 7 సిక్స్లు 1 ఫోర్ కొట్టి 48 పరుగులు చేశాడు.

Share.

Comments are closed.

%d bloggers like this: