మీ భవిష్యత్తు-నా బాధ్యత..! చంద్రబాబు మ్యానిఫెస్టో..!

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నేడు ఉగాది సంధర్భంగా అమరావతిలో ఆయన మ్యానిఫెస్టో ని విడుదల చేశారు. గెలుపే లక్ష్యంగా అధికారమే ధేయంగా ముందుకు దూసుకుపోయే కాలంలో చంద్రబాబు ప్రత్యేకంగ శ్రద్ధ వహించి ప్రజల సంక్షేమమే లక్ష్యంగా అభివృద్దే ధ్యేయంగా చేసుకొని సంక్షేమ పథకాలని టీడీపీ హామీలని మ్యానిఫెస్టో లో ప్రతిపాదిస్తూ ప్రెస్ మీట్ ద్వారా విడుదల చేశారు. పెద బడుగు బలహీన వర్గాలకి.. విద్యార్థులకి.. మహిళలకి.. రైతులకి పెద్ద పీట వేశారు చంద్రబాబు. తాను ప్రచారం లో ఇచ్చిన హామీలని చేసిన వాగ్దానలని చేయబోయే హామీలని అన్నిటినీ ఈ మ్యానిఫెస్టో లో యాడ్ చేశారు. తన అనుభవాన్ని విజన్ ని క్షేత్ర స్థాయిలో ఉపయోగించి చంద్రబాబు ఈ మ్యానిఫెస్టో ని తయారు చేయించారు. తన మ్యానిఫెస్టో ని.. మీ భవిష్యత్తు-నా బాధ్యత అని పేరుతో విడుదల చేశారు చంద్రబాబు.

మీ భవిష్యత్తు-నా బాధ్యత :

•  పంట భీమా సదుపాయం
•  రైతు భీమా కింద రూ.10 లక్షలు
•  రూ.5వేల కోట్ల రూపాయాలతో స్థిరీకరణ నిధి
•  కేంద్రంతో పోరాడి వ్యవసాయానికి నరేగా అనుసంధానం
•  చిన్న, మధ్య తరహా పారిశ్రామిక పార్కుల ఏర్పాటు
•  కోటి ఎకరాల్లో మైక్రో ఇరిగేషన్ అభివృద్ధి
•  ప్రతీ ఏటా అన్నదాత సుఖీభవ అందిస్తాం
•  ఎంత అవసరమైతే అంత వడ్డీ లేని రుణాలు
•  ప్రతీ జిల్లాకు ఇంక్యుబేషన్ సెంటర్స్, ఫుడ్ ప్రాసెసింగ్ ఏర్పాటు
•  రాబోయే ఐదేళ్లలో నీటి సమస్య లేకుండా చేస్తాం
•  పెన్షన్లు రూ.3వేలకు పెంచుతాం
•  పెళ్లి కానుకను రూ.1లక్ష నుంచి పెంచుతాం
•  100 గురుకుల పాఠశాలలు, ఎస్టీలకు 50 గురుకుల పాఠశాలలు
•  విదేశీ విద్యకు అన్ని వర్గాల వారికి ఆర్థిక సాయం
•  అంబేద్కర్ స్మృతివనం, జగ్జీవన్ స్మృతివనం త్వరలోనే పూర్తి చేస్తాం
•  మాదిగ, రెల్లి వర్గాలకు ప్రత్యేక కార్పొరేషన్స్
•  బీసీ డెవలప్‌మెంట్ బ్యాంకు రూ.10 వేల కోట్లతో ఏర్పాటు
•  స్వయం ఉపాధి కోసం ఇన్నోవా లాంటి కార్లు కొనుక్కునేవారికి 25శాతం సబ్సిడీ
•  చేనేత కార్మికులకు ఉచిత ఆరోగ్య ఇన్సూరెన్స్
•  విద్యుత్ వాహనాలను ప్రమోట్ చేస్తాం
•  మైనారిటీ యువకులకు ఆటో రిక్షాలకు, ఎలక్ట్రిక్ వాహనాలకు 50శాతం సబ్సిడీ
•  ట్రిపుల్ తలాక్, ముస్లింలకు 4శాతం రిజర్వేషన్‌పై రాజీలేని పోరాటం చేస్తాం
•  క్రిస్టియన్ల కోసం ప్రతీ జిల్లాలో ఒక భవనం, స్మశానాలకు స్థలం కేటాయింపు
•  ఇమామ్‌లకు, పాస్టర్లకు ఉచిత ఇళ్లు కట్టిస్తాం
•  దివ్యాంగుల స్వయం ఉపాధి కోసం రూ.50కోట్ల మూలధనం
•  మానసిక వికలాంగుల పరిస్థితిని బట్టి రూ.3వేల పెన్షన్
•  ఇంటర్మీడియట్ పాసైతే చాలు నిరుద్యోగ భృతి
•  2వేల జనాభా ఉన్న గ్రామాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్
•  విజయనగరం, కడప, నెల్లూరు నగరాల్లో ఫుడ్ పార్కులు
•  తిరుపతిలో ఎలక్ట్రానిక్ పార్క్
•  విశాఖపట్నంలో ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్
•  విశాఖ-చెన్నై, బెంగళూరు-చెన్నై కారిడార్ ఏర్పాటు
•  సముద్రంలో వేటకు వెళ్లేవారికి క్రాప్ హాలిడే కింద రూ.10వేలు చెల్లిస్తాం
•  రాజకీయ ప్రాతినిధ్యం లేని వడ్డెర, బ్రాహ్మణ వర్గాలకు ఎమ్మెల్సీలు
•  ప్రతీ గ్రామంలో మెయిన్ రోడ్ నుంచి లోపలి వరకు బీటీ రోడ్ల నిర్మాణం
•  2కోట్ల ఎకరాలకు నీరు అందించే బాధ్యత తీసుకున్నాం
•  ఇంటర్మీడియట్ నుంచి విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందిస్తాం
•  పట్టణాల్లో తోపుడుబండ్ల వారికి ఇబ్బందులు లేకుండా చేస్తాం
•  ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లకు సీపీఎస్ విధానం రద్దు
•  డ్వాక్రా మహిళలకు ఉచిత సెల్‌ఫోన్లు

Share.

Comments are closed.

%d bloggers like this: