బాబాయ్ కోసం అబ్బాయ్..! ప్రచారంలో చెర్రీ..!

Google+ Pinterest LinkedIn Tumblr +

మెగా హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించినప్పటినుండి ఇంటరిగానే పోరాడుతున్నాడు.. ప్రచారంలో కూడా ఆయన ఒంటరిగానే ముందుకెళుతున్నారు. తన అన్న నాగబాబు ఎంట్రీ తరువాత కాస్త తోడు దొరికినంత పనయ్యింది. నాగబాబు వచ్చిన తరువాత తన అన్న వదిన ప్రచారం లో దిగారు. ఇక నాగబాబుతో పాటు తన కొడుకు హీరో వరుణ్ తేజ్ కూడా ఎన్నికల ప్రచారంలో భాగం అయ్యాడు. ఇక మెగా అభిమానులు అందరూ రామ్ చరణ్ ఎప్పుడొస్తారా తన బాబాయి గురించి ఎప్పుడు ప్రచారం చేస్తారా అని ఎదురు చూస్తున్నారు. కానీ కాలికి గాయం అవ్వడంతో ఆయన ప్రచారంలో పాల్గొనలేక పోతున్నారు అని వార్తోలొచ్చాయి.

ఇక అందరూ రామ్ చరణ్ రాలేదు అనే అనుకున్నారు..! కానీ తన బాబాయి గెలుపు గురించి గాయాన్ని సైతం పక్కన పెట్టి బాబాయ్ కొరకు రామ్ చరణ్ వస్తున్నారట. ఎన్నికల ప్రచారం లో తన బాబాయ్ తో ఆయన కూడా అడుగులేయబోతున్నాడట. పవన్ కళ్యాణ్ అస్వస్థత నుండి కోలుకున్నాడు ఇక ఆయన తెనాలి సభకి హాజరవుతున్నాడు. బాబాయ్ కొరకు రామ్ చరణ్ మరి కొంత సేపట్లో విజయవాడ చేరుకొనున్నారు. ఇక తెనాలి సభకి కూడా ఆయన చేరుకునే అవకాశాలు ఉన్నాయి. తెనాలి సభ తో పాటు మరో రెండు రోజులు బాబీ తోనే రామ్ చరణ్ పర్యటించబోతున్నాడు. ఇక రామ్ చరణ్ ఎంట్రీ తో జనసేన శ్రేణుల్లో కొంత ఉత్సాహం తప్పకుండ పెరిగే అవకాశం ఉంది.

Share.

Comments are closed.

%d bloggers like this: