జగన్‌తో మోత్కుపల్లి భేటీ..కారణం ఏంటి..?

Google+ Pinterest LinkedIn Tumblr +

ఈరోజు వైసీపీ అధినేత జగన్ తో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో ఉన్న జగన్ నివాసానికి మోత్కుపల్లి వచ్చారు. ఆయన్ను వైసీపీ నేతలు సాదరంగా లోపలకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏపీ, తెలంగాణలో రాజకీయ పరిస్థితులతో పాటు భవిష్యత్ కార్యాచరణపై జగన్ తో ఆయన సుదీర్ఘంగా చర్చించారు. జగన్-మోత్కుపల్లి భేటీ రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.

శనివారం మీడియాతో మాట్లాడిన మోత్కుపల్లి… కేసీఆర్ ఆహ్వానిస్తే టీఆర్ఎస్‌లోకి చేరేందుకు సిద్ధమన్నారు మోత్కుపల్లి. మండవ వెంకటేశ్వరరావును సీఎం కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించడాన్ని స్వాగతించారు. తెలంగాణలో టీడీపీ భూస్థాపితమైందని.. ఈ విషయాన్ని తాను గతంలోనే చెప్పానని గుర్తుచేశారు. ఏపీ ఎన్నికల్లో టీడీపీ ఓటమి ఖాయమన్నారు. ఏపీలో మాల, మాదిగలంతా వైసీపీకి మద్దతు పలకాలన్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: