బీజేపీ లో వైసీపీ విలీనం..? ఏపీ రాజకీయాల్లో సంచలనం..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఎన్నికలకు ఇంకా 3 రోజులు మాత్రమే గడువు ఉంది. దీంతో పార్టీలన్ని ప్రచారంలో జోరు పెంచాయి. వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ..ప్రత్యర్థులపై మాటల యుద్ధం చేస్తూ దూసుకుపోతున్నారు. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో అన్న విషయం కొంచెంసేపు పక్కన పెడితే… ఎన్నికల అనంతరం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చోటుచేసుకోబోతున్న భారీ మార్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఏపీలో సొంతంగా అధికారం లోకి రావాలనే ఆశ అయితే బీజేపీ కి ఉంది కాని, అందుకు తగ్గ కేడర్, లీడర్స్ బీజేపీ కి లేరు. బీజేపీ లో ఉన్న నాయకులు గ్రహాల లాంటి వాళ్ళే కాని స్వయం ప్రకాశం ఉన్న స్టార్స్ కాదు. హరిబాబు, వెంకయ్య,పురంద్రీశ్వరి, కన్నా, కావూరి, కామినేని, గంగరాజు ఇలా అందరూ తెరవెనుక రాజకీయాలు చేయగల సమర్థులే కాని, పార్టీ ని లీడ్ చేసే సత్తా ఉన్న వాళ్ళు కాదు. అందుకే బీజేపీ ఒక పొలిటికల్ స్టార్ కోసం చూస్తోంది.

ఆ దిశగా చూస్తున్న బీజేపీ కన్ను ఇప్పుడు జగన్ మీద పడింది. దీనికి ఆధారాలు ఏమిటంటే.. జగన్ కేసుల విషయం లో సిబిఐ, ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ లు (ఈడి) నిదానంగా వ్యవహరిస్తుండటం. ఈ అంశాల ఆధారంగా బీజేపీ, వైసీపీల మధ్య ఏదో జరుగుతోందని మనం భావించవచ్చు. జగన్ కి బీజేపీ తో కలవడం ఎందుకు అవసరం? జగన్ కి తన మీద ఉన్న కేసులని వదిలించుకోవడం అత్యవసరం. ఒక్క కేసులో దోషిగా తేలినా ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కోల్పోతే తనకి రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది.

అందుకే జగన్ కి బీజేపీ సపోర్ట్ చాలా కీలకం.టీడీపీ తో బీజేపీ కి సమస్య ఏమిటి? బీజేపీ టీడీపీని నమ్మకమైన స్నేహితుడిగా భావించడం లేదు. గత ఎన్నికల్లో అవసరార్థం పొత్తు పెట్టుకున్నారు కానీ, చంద్రబాబు బలపడితే, తన కొడుక్కి రాష్ట్రాన్ని అప్పగించి, తను జాతీయ రాజకీయాల్లోకి వస్తాడని థర్డ్ ఫ్రంట్ అనో, సెక్యులర్ ఫ్రంట్ అనో ఏదో ఒక హడావిడి చేసి బీజేపీ వ్యతిరేక శక్తులని కూడగడతాడని బీజేపీ అనుమానిస్తోంది. అందుకే చంద్రబాబు కాళ్ళరిగేలా ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నా కేంద్రం పైసా విదల్చడం లేదు.

వైసీపీ-బీజేపీ విలీనం..

వైసీపీ-బీజేపీ విలీనంలో భాగంగానే లోటస్ పాండ్ లో బీజేపీ పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ తో జగన్ భేటీ అయ్యారు.. ఎన్నికలయ్యేవరకు పరిస్థితిని ఇలాగే నడిపించి ఆ తర్వాత బీజేపీ తో కుమ్మక్కవ్వాలన్నదే ఈ భేటీ పరమార్థం అని తెలుస్తుంది.. అయితే జగన్ ని కలవడం వెనకాల మోడీ పెద్ద పన్నాగమే పన్నుతున్నాడని తెలుస్తుంది… జగన్ తో కలయిక తో ఆంధ్ర లో అసలే పట్టు లేని బీజేపీ ఎంతో కొంత మద్దతు వైసీపీ ద్వారా తెచ్చుకోవాలని చూస్తుంది..

ఇక కర్ణాటక లో కూడా కుమారస్వామి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దించి అధికారంలోకి రావాలని చూస్తుంది బీజేపీ. అందుకు జగన్ కూడా అక్కడి బీజేపీ నేత గాలి జనార్దన్ రెడ్డి కి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు.. ఇలా దక్షిణాదిన ఉన్న రాష్ట్రాలలో బీజేపీ తన బలం పెంచుకోవాలని పావులు కదుపుతూ ప్రతిపక్ష నాయకులను టార్గెట్ చేసి వారిని తన బుట్టలో వేసుకుంటుంది..

బీజేపీ స్కెచ్ ఏమిటంటే..

జగన్ ను పార్టీలోకి చేర్చుకుని, జగన్ ద్వారా కేంద్రం పై వత్తిడి పెంచి ఏపి కి ప్యాకేజి కాని, ప్రత్యేక హోదా కాని ఇప్పించాలి. జగన్ పై ఉన్న కేసులని నీరు గార్చాలి. ఫైనల్ గా బీజేపీ ఏపి లో అధికారం లోకి రావాలి. ఇదీ బీజేపీ స్కెచ్. బీజేపీ అనుకున్నది అనుకున్నట్లు జరిగితే, వైకాపా బీజేపీ లో విలీనం కావడం ఖాయం గా కనిపిస్తోంది.

Share.

Comments are closed.

%d bloggers like this: