రుజువు చేస్తే నీకు అభిషేకం చేసి.. ఇంట్లో ని ఫోటో పెట్టుకుంటా..!

Google+ Pinterest LinkedIn Tumblr +

వైసీపీ నేత సినీ నటుడు పోసాని కృష్ణమూరళి నిత్యం వైసీపీకి సపోర్ట్ చేస్తూ ఇతర పార్టీలపై పార్టీ నేతలపై విమర్శలు చేస్తుంటాడు. ఎన్నికలు దేగ్గర పడుతుండటంతో ఆయన జోష్ పెంచారు. వైసీపీ అధినేత జగన్ పై ఎవరైన కామెంట్ చేశారంటే చాలు మీడియా ముందు వాలిపోతున్నాడు వారిపై నిప్పులు చెరుగుతున్నాడు.. ఇటీవలే టీడీపీ అధినేత చంద్రబాబు పై తన కులం పై విమర్శలు చేసి ఈసీ నుండి నోటీసులు అందుకున్నాడు.. అయినా కూడా ఆయన మళ్ళీ మీడియా ముందుకొచ్చి అలాగే విమర్శలు చేస్తున్నాడు. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేశాడు.

ఈరోజు ఉదయం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. వైఎస్ జగన్ మీద పవన్ ఎందుకు ఆరోపణలు చేస్తున్నాడు అని ప్రశ్నించాడు. వైఎస్ జగన్ చాలా గొప్ప వ్యక్తని క్యారెక్టర్ ఉన్న మనిశాని ఆయన అన్నారు. జగన్ మాటిస్తే నిలబెట్టుకుంటాడని అలాంటి వ్యక్తి పై పవన్ ఆరోపణలు చేయడం సరికాదని ఆయన మండిపడ్డారు. జగన్ పై ఆరోపణలు చేస్తున్న పవన్ జగన్ పై చేసిన ఆరోపణలకి ఆధారాలు ఉంటే బయటపెట్టమని పవన్ ని అడిగారు. పవన్ కళ్యాణ్ ని జగన్ అవినీతి పై ఆధారులు ఇవ్వమని ఆధారాలు ఇచ్చి రుజువు చేస్తే.. తాను పవన్ కళ్యాణ్ పాదాలకి నమస్కరించి, పాలాభిషేకం చేసి తన ఇంట్లో ఉన్న జగన్ ఫోటో తీసి పవన్ ఫోటో పెట్టుకుంటా అని ఆయన వ్యాఖ్యానించారు.

Share.

Comments are closed.

%d bloggers like this: