స్ట్రెచర్ పైన తిక్కా రెడ్డి..ప్రచారం మాత్రం వదలం..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఎన్నికల ప్రచారం చేసేందుకు రేపటితో తుది గడువు ఇక నేతలంతా విస్తృతంగా ప్రచారాలు చేస్తున్నారు. ఎండలు మండుతున్నా..! వాడ దెబ్బలు తాకినా..! నేతలు ప్రచారం చేసి తీరుతాం అనే స్పూర్తితో దూసుకుపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా మంత్రాలయం టీడీపీ అభ్యర్థి అయితే ఏకంగా స్ట్రెచర్ పై ఉన్నప్పటికీ ప్రచారం చేశారు. అదే స్ట్రెచర్ పై ప్రచారంలో పాల్గొన్నారు. ఓటర్లని తమ పార్టీకి ఓటు వేయాలంటూ నినాదాలు చేశాడు. ఆయన స్పూర్తికి ఓటర్లు ఫిదా అవుతున్నారు.

కాలికి బులెట్ గాయం అయ్యింది.. కనీసం నడిచే పరిస్థితిలో కూడా లేరు..! ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయినా కూడా ఎన్నికల ప్రచారానికి హాజరయ్యారు. స్ట్రెచర్ పైనే క్యాంపెయిన్ చేశారు.. ఆయనే మంత్రాలయం టీడీపీ అభ్యర్థి ప్యాలకుర్తి తిక్కారెడ్డి. టిక్కారెడ్డి ఇప్పటికే సైకిల్ యాత్ర, ర్యాలీలు, సభలు నిర్వహిస్తూ నియోజకవర్గం లోనే అనేక గ్రామాలు చుట్టేశారు. అయితే ఇదే క్రమంలో మంత్రాలయం మండలం ఖగ్గల్లు గ్రామంలో ప్రచారానికి చేరారు.

అక్కడ ఉన్న స్థానికీ వయీసీపీ నేతలు టిక్కారెడ్డి ని అడ్డుకున్నారు. ఇక ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. తోపులాట జరుగుతుండగా ఆయన అంగరక్షకులు గాల్లోకి కాల్పులు చేశారు ఈ ఘటనలో తిక్కరెడ్డి కాలికి బుల్లెట్ గాయమయ్యింది. అప్పటికీ నామినేషన్ కూడా వేయలేదు. అయినప్పటికీ ఆసుపత్రి నుండి అలాగే స్ట్రెచర్ పై వెళ్ళి నామినేషన్ దాఖలు చేశాడు.. ఇక ఎన్నికల ప్రచారం గడువు దేగ్గర పడుతుండటంతో ఆయన స్వయానా స్ట్రెచర్ పై వెళ్ళి ప్రచారంలో పాల్గొన్నాడు.. ఆయనకి అండగా తన భార్య నిలిచి ఓటర్లని తమకే ఓటు వేయమని అభ్యర్థించింది.

Share.

Comments are closed.

%d bloggers like this: