‘ సంక్లప పాత్ర ‘ బీజేపీ మ్యానిఫెస్టో..!

Google+ Pinterest LinkedIn Tumblr +

దేశ వ్యాప్తంగా ఎన్నికలు దేగ్గర పడుతున్నాయి.. నేతలు అందరూ తమతమ మ్యానిఫెస్టోలని విడుదల చేస్తున్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ఇప్పటికే తమ మ్యానిఫెస్టోని విడుదల చేసింది. ఇక అధికార పార్టీ బీజేపీ కూడా కొంత సేపటి క్రితమే మ్యానిఫెస్టోని విడుదల చేసింది. ప్రధాని మోదీ చేతుల మిదిగా బీజేపీ మ్యానిఫెస్టో విడుదల అయ్యింది. సంకల్ప పత్ర పేరుతో నలబై పేజీల మ్యానిఫెస్టో ని విడుదల చేశారు.
కార్యక్రమానికి కేంద్ర హోమ్ మంత్రి రాజ్ నాథ్ సింగ్, చినమ్మ సుష్మా స్వరాజ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పాల్గొన్నారు. 6 కోట్ల ప్రజల అభిప్రాయాలు తీసుకొని మేనిఫెస్టోను తయారు చేశామని మేనిఫెస్టో కమిటీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. 130 కోట్ల భారతీయుల సంక్షేమమే లక్ష్యంగా మ్యానిఫెస్టోని తయారు చేశామని ఆయన అన్నారు. అమిత్ ష మాట్లాడుతూ.. రూ.12 లక్షల కోట్ల స్కాంలను వెలుగులోకి తెచ్చామని వివరించారు. సమాఖ్య స్ఫూర్తితో పనిచేస్తున్నామన్నారు. 7 కోట్ల మందికి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామని తెలిపారు. 12 కోట్ల మంది రైతులకు సాగులో సాంకేతికతను అందించామన్నారు. ఇక బీజేపీ మ్యానిఫెస్టో లో ప్రధానంగా ఉగ్రవాదం, అభివృద్ధి, మహిళా సాధికారత, రామమందిర నిర్మాణం వంటి అంశాలపై దృష్టిసారించింది. నిరుద్యోగ సమస్య దేశాన్ని పట్టిపీడిస్తుండటంతో యువతకు ఉపాధి, నైపుణ్యాల కల్పనపైనా బీజేపీ మ్యానిఫెస్టోలో ప్రస్తావన ఉంది.

సంకల్ప పత్ర :

బీజేపీ మ్యానిఫెస్టో కీలక అంశాలు :

•  దేశ శ్రేయస్సు కోసం ఉమ్మడి పౌర స్మృతి బిల్లు ప్రవేశం
•  రైతులు కిసాన్ క్రెడిట్ కార్డులపై లక్ష రూపాయల వరకు తీసుకునే రుణాలకు వడ్డీ రాయితీ
•  రైతులు కిసాన్ క్రెడిట్ కార్డులపై లక్ష రూపాయల వరకు తీసుకునే రుణాలకు వడ్డీ రాయితీ
•  అన్ని వర్గాల రైతులకూ కిసాన్ సమ్మాన్ నిధి పథకం వర్తింపు.
•  చిన్న, సన్నకారు రైతులకు పెన్షన్ పథకం, చిన్న వ్యాపారులకు పెన్షన్ పథకం అమలు
•  ఉగ్రవాదంపై రాజీలేని పోరాటం, జాతీయ భద్రత, తీరప్రాంత రక్షణ, సైనికుల సంక్షేమానికి పెద్దపీట
•  జమ్మూకాశ్మీర్‌లో శాంతి భద్రతల పర్యవేక్షణకు ప్రయత్నాలు
•  రైతులందరికీ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన వర్తింపు
•  చిన్న, సన్నకారు రైతులకు పింఛను
•  వ్యవసాయ గ్రామీణ రంగానికి రూ.25 లక్షల కోట్ల పెట్టుబడి
•  ప్రధానమంత్రి ఫసల్ భీమో యోజన కింద అందరికీ భీమా వర్తింపు
•  రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాల సరఫరా
•  దేశవ్యాప్తంగా గిడ్డంగుల నెట్‌వర్క్ ఏర్పాటు
•  ఆర్గానికి ఫార్మింగ్‌లో లాభాలు పెరిగేందుకు చర్యలు
•  మత్య్స సంపద యోజన కింద రూ.10 వేల కోట్లు కేటాయింపు
•  ఆక్వాకల్చర్‌కు తేలిగ్గా రుణ సదుపాయం
•  సముద్ర గడ్డి పెంచే దిశగా రైతులకు సదుపాయాలు
•  2022 నాటికి అందరికీ పక్కా ఇళ్లు
•  భారత్ నెట్ ద్వారా 2022 నాటికి అందరికీ ఇంటర్నెట్
•  జల్ జీవన్ మిషన్ ద్వారా 2024 నాటికి అందిరికీ తాగు నీరు
•  సడక్ సే సమృద్ధి ద్వారా అందరికీ రోడ్లు
•  స్వచ్ఛ భారత్ మిషన్ కింద వృథా నీటిని తిరిగి మంచి నీరుగా మార్పు
•  రూ.5 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థకు సరికొత్త రోడ్ మ్యాప్
•  ప్రపంచ వ్యాప్తంగా యోగా విస్తరణ, ప్రచారం
•  2024 నాటికి రూ.100 లక్షల కోట్ల మూలధన పెట్టుబడి
•  మేకిన్ ఇండియా నినాదానికి మరింత గుర్తింపు
•  స్టార్టప్స్ పెంచేందుకు సీడ్ స్టార్టప్ ఫండ్ కింద రూ.20,000 కోట్లు కేటాయింపు
•  2022 నాటికి అన్ని రైల్వే ట్రాకులనూ బ్రాడ్ గేజ్‌గా మార్పు
•  2022 నాటికి అన్ని రైల్వే ట్రాకులకూ ఎలక్ట్రిఫికేషన్
•  2022 నాటికి అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో వై-ఫై సౌకర్యం
•  ఐదేళ్లలో ఇప్పుడున్న 101 విమానాశ్రయాల సంఖ్య రెట్టింపు
•  2022 నాటికి అన్ని గ్రామ పంచాయతీలకూ హై స్పీడ్ ఆఫ్టికల్ ఫైబర్ ఏర్పాటు

Share.

Comments are closed.

%d bloggers like this: