గుడివాడలో పసుపు జెండా ఎగరాబోతుంది…!- అవినాష్

Google+ Pinterest LinkedIn Tumblr +

టీడీపీ కి గుడివాడ నియోజకవర్గం కంచు కోట అనే చెప్పాలి. గుడివాడ లో ఎప్పుడూ టీడీపీ దే గెలుపు అని మనం తరాల నుండి చూస్తున్నాము కానీ గత ఎన్నికల్లో అక్కడ వైసీపీ నుండి పోటీ చేసిన కొడాలి నాని గెలుపొందారు. ఇక ఈసారి ఆయనకి ధీటుగా ఎలాగైనా గెలుపొందాలనే లక్ష్యంతో టీడీపీ దేవినేని నెహ్రూ తనయుడు దేవినేని అవినాష్ ని బరిలోకి దింపింది. ఇద్దరు యువకులే.. ఇద్దరూ ప్రజలని బాగా చదవగలరు కాబట్టి ఇప్పుడు అక్కడ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. రాష్ట్రం లో అందరి దృష్టి ఆకట్టుకునే నియోజకవర్గాల్లో గుడివాడ ఒకటి అనట్టుగా మారింది.

చంద్రబాబు ఆదేశాల మేరకు గుడివాడ నుండి దేవినేని అవినాష్ బరిలోకి దిగారు. చంద్రబాబు అవినాష్ కి టికెట్ ఇవ్వగానే అవినాష్ గుడివాడ లోనే ఇల్లు కొనుకుని అక్కడే నివాసం ఉంటున్నాడు. ఇద్దరు నేతలు జోరుగా ప్రచారం చేశారు. అయితే తాజాగా అవినాష్ మీడియా తో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. తాను పుట్టింది కృష్ణా జిల్లాలోనే అని, చంద్రబాబు ఆదేశాలతో గుడివాడ నుంచి పోటీచేస్తున్నానని వివరించారు. వ్యాపారాల కోసం నియోజకవర్గ ప్రజలను కూడా వదిలేసి హైదరాబాద్ వెళ్లి, ఎప్పుడో ఏడాదికోసారి వచ్చే వ్యక్తి లోకల్ ఎలా అవుతాడంటూ నానిపై విమర్శలు చేశారు. చంద్రబాబు టికెట్ ఇవ్వడంతో గుడివాడలోనే ఇల్లు కొనుక్కున్నానని, చనిపోయేవరకు ఇక్కడే ఉంటానని స్పష్టం చేశారు.

నాని నోటికి హద్దు లేకుండా పోయిందని బవజాలాన్ని అదుపులో పెట్టుకోవాలని అవినాష్ అన్నారు. గతం లో కూడా ఇలాగే దురుసు మాటలు మాట్లాడి ఆసెంబ్లీ నుండి సస్పెండ్ అయ్యాడు.. ఇప్ప్దుడు కూడా ప్రచారల్లో ఆ దురుసు మాటలే మాట్లాడుతున్నాడు. తండ్రి వయసున్న చంద్రబాబుని అలా మాట్లాడటం సరికాదని ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు అని ఆయన స్పష్టం చేశారు. నాని ప్రగల్బాలు పలికేముందు ఆయన గత ఎన్నికలు చూసుకోవాలని అవినాష్ అన్నారు. గత ఎన్నికల్లో అని కేవలం 10 వేల ఓట్ల మెజారిటీ తోనే గెలిచారని ఈసారి నాని ఓటమి తద్యం అని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు ఆశీస్సులతో ప్రజల ఆశీర్వాదాలతో ఈసారి గుడివాడలో జెండా ఎగరవేయబోతున్నానని ఆయన అన్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: