మాకు ఏ పొత్తు లేదు.. ఏ బీ టీమ్ లేదు..!- రామ్ మాధవ్

Google+ Pinterest LinkedIn Tumblr +

మొన్న బీజేపీ నేత రామ్ మాధవ్ వైసీపీ అధినేత జగన్ భేటీ అయిన విషయం తెలిసిందే.. అయితే ఇక అప్పటినుండి వారి భేటీ పై అనేక అనుమానాలు వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ప్రచారంలో భాగంగా చంద్రబాబు.. జగన్ కేసీఆర్, మోదీ ల పట్టాన చెరీ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. పరిస్థితులు చూస్తే అవునేమో అన్నట్టే కనిపించాయి. జగన్ కూడా ఏనాడూ బీజేపీ ని విమర్శించకపోడం జనాలకి నిజమేనేమో జగన్ పరోక్షంగా మోదీ కి సపోర్ట్ చేస్తున్నారేమో అన్నట్టే కనిపించింది. ఇక ఈ అనుమానాలపై ఆరోపణలపై బీజేపీ నేత రామ్ మాధవ్ స్పందించారు ఈ ఆరోపణల్ని ఆయన కొట్టి పారేశారు. వీటిలో ఎలాంటి వాస్తవం లేదని ఆయన తేల్చేశారు. గతంలో చంద్రబాబు తో పొత్తు పెట్టుకొనే చాలా నష్టపోయాము ఈ ఎన్నికల్లో ఎలాంటి పొత్తులు లేకుండా ఒంటరిగా పోటీ చేస్తున్నామని ఆయన తేల్చేశారు.

జగన్ ను తామేమీ ప్రాక్సీగా వినియోగించుకోవడం లేదని, ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో స్పష్టం చేసిన ఆయన, అదే జరిగివుంటే జగన్ పై విచారణ, ఆయన సంస్థల, బంధువుల ఆస్తుల అటాచ్‌మెంట్ ఉండేదా..? అని ప్రశ్నించారు. తమకెవరూ బీ-టీమ్ లేరని, గతంలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని నష్టపోయామని ఆయన అన్నారు. ఇకపై అటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా సొంతంగా ఎదిగేందుకు కృషి చేస్తామని అన్నారు.

ఇన్వెస్టిగేటింగ్ ఏజన్సీల స్వతంత్రతను తాము ఎన్నడూ అడ్డోకవడం లేదని, వారు చేసే పని వారు చేసుకుంటూ పోతున్నారని, తాము కల్పించుకోవడం లేదని వెల్లడించారు. సీబీఐ, ఈసీలను బీజేపీ వాడుకుంటోందన్నది తప్పుడు ఆరోపణలని, అలాగే వాడుకుని వుంటే తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది జైల్లో ఉండేవారని అన్నారు. గతంలో తప్పులు చేసి ఉండబట్టే చంద్రబాబు ఇప్పుడు భయపడుతున్నారని విమర్శలు గుప్పించారు.

Share.

Comments are closed.

%d bloggers like this: