నోరు జారిన సండ్ర..! మొన్న నామా నిన్న సండ్ర..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా ఇతర పార్టీ నేతలనీ టీఆర్ఎస్ తమ పార్టీలో చేర్చుకుంటుంది. ఈ క్రమంలో తాజాగా నామ నాగేశ్వర రావు, సండ్ర వెంకట వీరయ్య పార్టీలోకి వచ్చారు. నామా నాగేశ్వరరావు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున ఖమ్మం నుండి పోటీ చేసి ఓడిపోయారు ఇక ఆయనని పార్టీ లోకి ఆహ్వానించి ఖమ్మం ఎంపీ టికెట్ ఇచ్చారు. ఇక సండ్ర వెంకట వీరయ్య సత్తుపల్లి నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. ఇక ఆయనను కూడా పార్టీ లోకి ఆహ్వానించారు.. ఆపరేషన్ ఆకర్ష్ సక్రమంగా చేసినా వారి మనసుల్లో నరాల్లో జీర్ణించుకుపోయిన టీడీపీ నినాదాలని టీడీపీ నియమాలను మార్చలేకపోయారు.

ఇన్ని ఏళ్ళు ఒకే పార్టీ లో ఉండి ఇప్పుడు సడన్ గా వేరే పార్టీలోకి వెళ్ళగానే ఆ పార్టీ నియమాలని నినాదాలని అలవరుచుకోవాలంటే అది కొంచం కష్టమే కానీ వీళ్ళకి సమయం లేదు ఎన్నికలు 20 రోజుల ముందు పార్టీలోకి వచ్చి.. వచ్చి రాగానే కొత్త పార్టీ నుండి క్యాంపెయిన్ చేయాలంటే అదో టాస్క్ అనే చెప్పాలి. అయితే కొద్ది రోజుల క్రితం నామ నాగేశ్వర రావు క్యాంపెయిన్ చేస్తుండగా ఆయన ఓటర్లకి సైకిల్ గుర్తుకే వోటు వేయాలంటూ విజ్ఞప్తి చేశాడు వెంటనే గుర్తించి కారు గుర్తుకే ఓటు వేయాలని సరిదిద్దుకున్నాడు.. ఇక ఈయన సైకిల్ గుర్తుకే మన ఓటు అనేసరికి టీఆర్ఎస్ నేతలు షాక్ కి గురయ్యారు.

ఇక ఈయన ఇలా ఉంటే తాజాగా సండ్ర వెంకట వీరయ్య కూడా టీఆర్ఎస్ నేతలకి షాక్ ఇచ్చాడు. నిన్న కల్లూరులో రోడ్‌షోలో ఆయన నామా నాగేశ్వరరావు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ప్రచారం లో పాల్గొన్నారు. ఆయన ఆట్లాడుతూ.. సైకిల్ గుర్తుకే మన ఓటు అనడంతో పక్కనున్న టీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు అక్కడి జనం షాక్ అయ్యారు.. వెంటనే కారు గుర్తుకే మన ఓటు అంటూ సరిదిద్దుకున్నాడు.. ఇక ఇద్దరు పార్టీ నేతలు ఇలా అనడంతో జనాలు విమర్శలు చేసుకుంటున్నారు. నిజానికి ఇద్దరు టీడీపీ పార్టీలో ఎప్పటినుండో ఉంటున్నారు ఇక వారికి భావిస్ఘ్యట్టు లేదని తెలుసుకొని టీఆర్ఎస్ లోకి వచ్చారు. ఇలా నోరు జారడం సహజం కాకపోతే మరో రెడ్ను రోజుల్లో ఎన్నికలు ఉన్నప్పుడు ఇలా అనడం రాజకీయంగా విమర్శలకి దారి ఇవ్వడం అనే చెప్పొచ్చు.

Share.

Comments are closed.

%d bloggers like this: