సైకిల్ స్పీడ్ పెరిగింది..! ఫ్యాన్ పవర్ తగ్గింది..!-రిపబ్లిక్ టీవీ సర్వే

Google+ Pinterest LinkedIn Tumblr +

రిపబ్లిక్ టీవీ సీ ఓటర్ సర్వే ఫలితాలని వెల్లడించింది. ఈ ఫలితాల్లో టీడీపీ డే పై చేయి అని తేల్చి చెప్పింది. జనవరి 25 న ఇదే సంస్థ నిర్వహించిన సర్వే లో వైసీపీ డి హవా నడవబోతుందని వైసీపీ 19 ఎంపీ స్థానాలు టీడీపీ కి 6 ఎంపీ స్థానాలు వస్తాయని వెల్లడించిన విషయం తెలిసిందే ఇక ఈసారి మాత్రం టీడీపీ కి 14 ఎంపీ స్థానాలు వయీసీపీ కీ 11 ఎంప్పి స్తానాలు వస్తాయని సర్వే లో వెల్లడించింది. రెండు నెలల క్రితం నిర్వహించిన సర్వే సమయానికి ఇప్పుడు నిర్వహించిన సర్వే సమాయానికి ఓటర్ల మనసుల్లో మార్పులు జరిగాయని వారి అభిప్రాయాలూ మారాయనై రిపబ్లిక్ టీవీ స్పష్టం చేసింది.

టీడీపీకి 38.5 శాతం ఓట్లు వస్తాయని రిపబ్లిక్ టీవీ- సీ ఓటర్ సర్వే అభిప్రాయపడింది. రాష్ట్రంలో టీడీపీకి 38.5 శాతం ఓట్లు దక్కుతాయని, వైసీపీకి36.5 శాతం వచ్చే అవకాశం ఉందని ఆ సంస్థ తేల్చింది. మరో వైపు కాంగ్రెస్, బీజేపీలకు ఈ ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటు కూడ దక్కదని ఆ సంస్థ స్పష్టం చేసింది. అయితే కాంగ్రెస్‌కు 10.4 శాతం, బీజేపీకి 6.5 శాతం, ఇతరులకు 8.2 శాతం ఓట్లు దక్కే అవకాశం ఉందని ఆ సంస్థ తేల్చి చెప్పింది.

జరగనున్న ఎన్నికల్లో చాలా గట్టి పోటీ ఉండబోతుందని వయీసీపీ పై టీడీపీ ఆధిక్యం పొందినా చాలా స్వల్ప తేడా ఉండబోతుందని సంస్థ వెల్లడించింది. ఇక పోతే కాంగ్రెస్ కి బీజేపీ లకి ఒక్క ఎంపీ సీటు కూడా రాదని సంస్థ సర్వే ఫలితాల్లో వెల్లడించింది. మొత్తానికి అంధ్ర్తప్రదేశ్ లో ప్రాంతీయ పార్టీలదే జోరు ఉండబోతుందని జాతీయ పార్టీలకి ఎంపీ సీట్లు రావని సంస్థ వెల్లడించినట్టు తెలుస్తుంది.

Share.

Comments are closed.

%d bloggers like this: