రహమాన్ అందించిన అవెంజర్స్ థీమ్ సాంగ్.. మీకోసం..!

Google+ Pinterest LinkedIn Tumblr +

భారత దేశ ప్రముఖ సంగీత దర్శకుడు ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏఆర్ రెహమాన్ వివిద భాషల్లో వివిద దేశాల్లో సంగీతం అందుస్తున్నాడు. టాలీవుడ్ బాలివుడ్ కోలీవుడ్.. ల లోనే కాకుండా అప్పుడప్పుడు హాలీవుడ్ లోనూ సంగీతం అందిస్తూ ఉంటాడు. ఈయనకి దేశం లోనే కాకుండా అంతర్జాతీయంగా అభిమానులు ఉన్నారు. ఈయాన పాటలను వినే సంగీత ప్రియులు ప్రపంచవ్యాప్తంగా ఎందరో ఉన్నారు. తాజాగా అవెంజర్స్ సిరీస్ వాళ్ళు త్వరలో రానున్న అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమాకి గాను తెలుగులో రాబోతున్న వర్షన్ కి థీమ్ సాంగ్ ని సిద్ధం చేయవలసిందిగా రెహమాన్ కోరారు.

ఇక ఆయన కంపోజ్ చేసిన పాటని నేడు అవెంజర్స్ ట్రైలర్ రిలీజ్ అయిన సంధర్భంగా ట్రైలర్ తో పాటు ఈ పాటను కూడా రిలీజ్ చేశారు. ‘ఆగేది లేదు ఎదురే అడ్డేమున్నా’ అంటూ పాట మంచి మ్యూజిక్ తో మంచి జోష్ తో నిండి ఉంది. ఈ పాటని ఎఆర్ రెహమాన్ స్వయంగా పాడారు. పాడటమే కాకుండా ఈ పాటలో ఆయన కూడా నటించారు.. ఇక పాట బ్యాక్ గ్రౌండ్ లో అవెంజర్స్ సినిమాలోని సూపర్ హీరోలు కనిపిస్తూ ఉంటారు.. ఇక ఆ సన్నివేశాలకి తగ్గట్టుగా పాటని పవర్‌ఫుల్ గా కంపోసే చేశాడు రెహమాన్. ఈ పాటని ప్రముఖ గీత రచయిత వెన్నెలకంటి తనయుడు రాకేందుమౌళి వెన్నెలకంటి రచించాడు. మళ్ళీ చాలా రోజులకి ఏఆర్ రెహమాన్ ఒక పవర్ ఫుల్ గీతాన్ని ప్రేక్షకులకి అందించాడు. ఇక ఈ సినిమా ప్రమోషన్ చేయడానికి అవెంజర్స్ అభిమానులకి ఈ పాత మంచి ఉత్సాహాన్ని తెప్పిస్తుంది అనడం లో ఎటువంటి సందేహం లేదు.

Share.

Comments are closed.

%d bloggers like this: