దెయ్యం పట్టిన బొమ్మ..! రెప్పలు లేకున్నా కళ్ళు మూస్తుంది..!

Google+ Pinterest LinkedIn Tumblr +

దయ్యాలు ఉంటాయా..? అవి ఆవహిస్తాయా..? మనుషులనే ఆవహిస్తాయా లేక సినిమాల్లో చూపించినట్టు బొమ్మలని వస్తువులని కూడా ఆవహిస్తాయా..? అనే ప్రశ్నలు చాలా సహజం. అయితే ఈ ప్రశ్నలకి జవాబు దొరికినట్టే..! ఇంగ్లాండ్‌లోని నట్టింగ్‌హమ్‌షిర్‌లోని మ్యాన్స్‌ఫీల్డ్ గల ‘ద విలేజ్ ఆఫ్ డామ్నేడ్’ అనే శిథిల భవనంలోకి వెళ్లిన పరానార్మల్ ఇన్వెస్టిగేటర్లు క్రిగ్ జోన్స్ (28), మట్ వుడ్ (48)లు అక్కడ అసాధారణ వాతావరణం ఉన్నట్లు కనుగొన్నారు.

ఆ ప్రదేశానికి వారు వెళ్ళగానే వారికి ఉనట్టుంది తల పట్టేసినట్టు బరువెక్కినట్టు అనిపించింది. పక్కన నుండి ఎవరో నడుస్తునట్టుగా అడుగుల శబ్దాలు వినపడ్డాయి.. అయితే ఇదంతా వారి బ్రమ అనుకుని అలాగే ముందుకెళ్లారు. ఇక అదే ఇంట్లో వారు ఒక బొమ్మని చూశారు.. ఆ బొమ్మ పేరే జనెట్..! ఈ జనెట్ అనే బొమ్మ 116 సంవత్సరాల కిందటిది, ఈ బొమ్మ యజమాని జూలీ.. జూలికి ఈ బొమ్మ వల్ల అమ్మమ్మ ఇచ్చింది వల్ల అమ్మమ్మకి వల్ల అమ్మమ్మ ఇచ్చింది తార తరాలుగా ఈ బొమ్మ వారి దేగ్గరి నుండి జూలీ కి చేరింది.

జనెట్ కథ :

జనెట్ ఈ బొమ్మ జూలీ దేగ్గర ఉన్నప్పుడూ ఆమెకి మానస్ శాంతి అస్సలు ఉండేది కాదు. రాత్రుల్లో ఏవేవో శబ్దాలు వచ్చేయి. ఏవేవో నీడలు కనిపించేవి. ఎవరో నడుస్తున్నట్టుగా అడుగుల శబ్దం వినపడేది.. ఇక ఈ బొమ్మ గురించి జూలికి తన ఇంట్లోని పెద్ద వాళ్ళు చెప్పారు. దీంతో ఈ బొమ్మని జూలీ మికి యార్క్ అనే పారా నార్మల్ యాక్టివిస్ట్ తో సంప్రదింపులు చేసి అతన్ని తీసుకువెళ్లమంది. ప్రస్తుతం మికి యార్క్ వద్దే ఈ బొమ్మ ఉంది. ఇక మికి దేగ్గర ఉన్నప్పుడూ కూడా ఈ బొమ్మ తో ఆయనకి కొన్ని సార్లు ఇబ్బందులు వచ్చాయి. ఈ బొమ్మ ని వీడియో తీస్తున్నప్పుడు కింద అంతస్తులో ఎవ్వరో పరిగెడుతూనట్టు శబ్దాలు వచ్చాయి. ఏవేవో నీడలు కనిపించాయి తన కూతురి బెడ్ రూమ్ తలపులు కూడా వాటంతటి అవే తెరుచుకునాయి అని మికీ తెలిపారు.

ప్రస్తుత కథ :

అయితే క్రిగ్ జోన్స్ (28), మట్ వుడ్ (48) లు వెళ్ళిన  ‘ద విలేజ్ ఆఫ్ డామ్నేడ్’ మికి ఉండే ప్రదేశం.. వీరు రీసర్చ్ కి వెళ్లినప్పుడు పైన పేర్కొనట్టుగా వారికి తల పట్టేయడం లాంటి సంఘటనలు ఎదురయ్యాయి. ఇక పోతే వీరు ఇప్పుడు ఆ బొమ్మని చూశారు దీని గురించిగా మీకిని అడిగితే మికి వారికి ఆ బొమ్మ గురించి చెప్పాడు. ఇక బొమ్మ గురించి తెలుసుకున్న ఇద్దరు ఆ బొమ్మతో సెల్ఫీ దిగడానికి ప్రయత్నించారు. అయితే విషయం ఏంటంటే ఆ బొమ్మ జనెట్ కి కను రెప్పలు ఉండవు పైగా నోరు కూడా కొంత తెరుచుకొని ఉంటుంది. కానీ వీరు సెల్ఫీ దిగినప్పుడు ఆ సెల్ఫి లో జనెట్ కను రెప్పలు మూసుకొని ఉన్నట్టుగా కనిపించింది పైగా నోరు కూడా మూసుకొని ఉన్నట్టుగా ఆ ఫొటోల్లో కనిపించింది అంటే కాదు జనెట్ కళ్ళకి మస్కర వేసినట్టు కనిపించింది. అక్కడ చీకటి ఉండటం తో వీరు ఆ బొమ్మని సరిగ్గా గమనించలేదు కాని వీళ్ళ ఫోటో లు గమనించిన మికి షాక్ కి గురయ్యాడు.. రెప్పలు లేని బొమ్మ కళ్ళు ఎలా మూసుకుంది కళ్ళకి మస్కర పెట్టినట్టు ఉండటం ఏంటి జనెట్ నోరు కూడా మూసుకొని ఉంది అనే విషయాన్ని వాళ్ళతో చెప్పాడు వాళ్ళు కూడా ఆ బొమ్మ పై తార్చ్ వేసి చూడగా ఆ బొమ్మకి నిజంగానే రెప్పలు లేవు నోరు తెరుచుకొని ఉంది ఇక ముగ్గురు షాక్ కి గురయ్యారు. ఇక వెంటనే మళ్ళీ ఎన్నిసార్లు ఫోటోలు దిగుదామని ప్రయత్నించిన ఆ ఫొటోల్లో జనెట్ కి రెప్పలు లేనట్టే కనిపిస్తుంది. ఇక ఈ విషయాన్ని తెలియజేస్తూ వాళ్ళు ఆ ఫోటోలని జనెట్ ఫోటో ని సామాజిక మాధ్యమాల్లో పెట్టారు ఇప్పుడు ఆ ఫోటోలు ఆ పోస్ట్ వైరల్ అవుతున్నాయి. కథ వింటుంటే వెన్ను వణుకుతుంది కదూ..!

Share.

Comments are closed.

%d bloggers like this: