నేడే అమేథీ నుండి రాహుల్ గాంధీ నామినేషన్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ ఈసారి జారబోయే ఎన్నికల్లో రెండు స్థానాల నుండి పోటీకి దిగుతున్నారు. ఒకటి కేరళ లోని వాయనాడ్ నుండి పోటీ చేస్తున్నారు.. ఇక కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అయిన అమేథీ నుండి కూడా ఆయన పోటీ చేస్తున్నారు. అమేథీ నుండి రాహుల్ గత మూడు దఫాలుగా ఎంపీ గా పోటీ చేసి గెలుపొందుతున్నారు. వాయనాడ్ నుండి తొలిసారిగా రాహుల్ పోటీ చేస్తున్నారు. వాయనాడ్ లో రాహుల్ ఇప్పటికే తన సొందరి తో కలిసి నామినేషన్ దాఖలు చేశాడు. ఇక అమేథీ నుండి రాహుల్ నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. అమేథీ లో ఆయన నామినేషన్ కార్యక్రమానికి కూడా తన సోదరి ప్రియాంక హాజరవుతున్నారు.

అయితే అమేథీ నుండి ఈసారి బీజేపీ తరఫున కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ రాహుల్ కి ధీటుగా నిలబడుతున్నారు. ఇప్పటికే ఇద్దరు నేతలు జరుగా ప్రచారాలు చేసేశారు ఇక వీరిద్దరి మధ్య పోటీ రసవత్తరంగా మారనుంది. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ గతంలో 2014 లో కూడా రాహుల్ కి ప్రథర్థిగా పోటీ చేశారు పోటీ చేసినప్పటికీ రాహుల్ గాంధీ ఏ విజేతగా నిలిచారు ఇక ఈసారి ఆమె పట్టు వదలకుండా మరోసారి రాహుల్ తో పోటీ పడుతున్నారు దేశం చూపంతా అమేథీ వైపు తిప్పుకున్నారు. ఇక ఎవరు గెలుస్తారు అనేది వేచి చూడాలి. ఇక నేడు రాహుల్ గాంధీ భారీ ర్యాలీతో వెళ్ళి ఆమేథీలో నామినేషన్ దాఖలు చేయనున్నారు..

Share.

Comments are closed.

%d bloggers like this: