ఈయన వీరప్పన్ కాదు..! తెలంగాణ వీరప్పన్..! పట్టేసుకున్నారు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

తమిళనాడు, కర్ణాటక పోలీసులకు ఫారెస్ట్ అధికారులకి కునుకు లేకుండా చేసిన వీరప్పన్ దాదాపుగా 20 ఏళ్ళు స్మగ్లింగ్ చేస్తూ అడ్డొచ్చిన అధికారులను దారుణంగా చంపేస్తూ అడవులకి రాజుల బ్రతికాడు. చివరికి పోలీసుల చేతిలో బలయ్యాడు. దాదాపుగా 700 కోట్లు ఖర్చుపెట్టించాడు. ఇక ఈయనని స్ఫూర్తిగా తీసుకున్నాడో ఏమో ఎడ్ల శ్రీనివాస్‌ అనే వ్యక్తి అదే భాతలో పయనించాడు అడ్డొచ్చిన వారిని అంతం చేస్తూ 2000 మంది సైన్యాన్ని తయారుచేసుకొని ఫారెస్ట్ లో స్మగ్లింగ్ చేస్తూ కోట్లు సంపాదించాడు.

వీరప్పన్ తమిళనాడు కర్ణాటక అడవుల్లో అక్రమాలు చేస్తే శ్రీనివాస్ తెలంగాణ మహారాష్ట్ర ఛత్తీస్‌గఢ్‌‌ అడవులను టార్గెట్ గా మార్చుకున్నాడు. ముందు ఎరువుల వ్యాపారం చేసిన శ్రీనివాస్ అక్కడ నష్టం రావడంతో అడవులపై పడ్డాడు. విచ్చల విడిగా స్మగ్లింగ్ కి పాల్పడ్డాడు. టెక్ చెట్లు ఎక్కడ కనిపించినా అవి తన ఖాతాలోనే వేసుకున్నాడు. గండపు చెక్క టేకు చెక్క అడవి సొమ్ముని తన సొమ్ముగా చేసుకున్నాడు. ఈక్రమంలో ఎందరో అధికారులని మట్టికరిపించాడు. ఇప్పటి వరకు ఈయన పై 12 కేసులు నమోదయ్యాయి. టేకు చెట్లని నరికెసి వాటిని గోదావరి-ప్రాణహిత నదీ పరివాహక ప్రాంతాల్లో దంప్ చేసి అక్కడ నుండి వివిధ ప్రాంతాలకు తరలించి అమ్మకాలు చేయించాడు.

ఇక ఈయన చర్యలు తెలిసిన అధికారు ఈయన పై నిఘా వేశారు.. ఎన్నో ప్రణాళికలు వేసినా అక్కడ నుండి తప్పించుకునేవాడు. దాదాపుగా 20 ఏళ్లుగా పోలీసులు అధికారులు ఈయన గురించి గాలిస్తూనే ఉన్నారు. 20 ఏళ్ళు ఈయన తప్పించుకుంటూనే ఉన్నాడు.. అయినా కూడా స్మగ్లింగ్ ని మాత్రం మానలేదు. ఇక తాజాగా ఎడ్ల శ్రీనివాస్ అతడి అనుచరులు కె.కిషన్‌, కె.మధుకర్‌, ఆర్‌.శ్రీనివాస్‌, వడ్ల సంతోశ్‌ లను పోలీసులు అరెస్ట్ చేసి భారీ సంఖ్యలో కలప, స్కార్ఫియోను స్వాధీనం చేసుకున్నారు. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలో అతడికి ‘తెలంగాణ వీరప్పన్’ అనే పేరున్నట్లు రామగుండం పోలీస్‌ కమిషనర్‌‌ సత్యనారాయణ తెలిపారు.

Share.

Comments are closed.

%d bloggers like this: