11 మంది అక్కడికక్కడే మృతి..! నారాయనపేట విషాదం..!

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలంగాణ లోని నారాయణ పేట లో విషాదం చోటు చేసుకుంది. 11 మండి కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు పేర్కొన్నారు. వివారాల్లోకి వెళితే.. ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కూలీలు ఉపాధి పనుల్లో భాగంగా ఒక సైట్ లో తవ్వకాలు జరుపుతున్నారు. అలా తవ్వుతూ వెళ్లారు అక్కడ మట్టి కాస్త వదులుగా ఉండేసరికి అమాంతం పైనుంచి మట్టి పెద్దలు కూలి కింద ఉన్న కార్మికులపై పడ్డాయి.

కింద తవ్వకాలు జరుపుతున్న కార్మికులపై భారీ మట్టి పెద్దలు పడటంతో 11 మంది ఉపాధి కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొంత మండి అక్కడే మట్టిలో చిక్కుకుపోయారు.. విషయం తెల్సిన అధికారులు ఘటనా స్థలానికి వెంటనే చేరుకున్నారు.. కింద చిక్కుకుపోయిన వారిని బయటకి తీస్తున్నారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఇప్పటి వరకు అయితే 11 మంది మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు ఇక మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
upadhi karmikulu

Share.

Comments are closed.

%d bloggers like this: