బాధ్యతని కక్ష సాధింపుగా పరిగణిస్తున్నారు..!- అరుణ్ జైట్లీ

Google+ Pinterest LinkedIn Tumblr +

దేశ వ్యాప్తంగా ఎన్నికలు సమీపించేస్తున్నాయి.. తెలుగు రాష్ట్రాల్లో రేపే ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి సమయంలో ఆధాయపు పన్ను శాఖ దక్షిణ రాష్ట్రాల పై పంజా విసిరింది. ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు సహా పలు రాష్ట్రాల్లో ఐటీ దాడులు జరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో ఐటీ దాడులు జరగడం తెలిసిందే అయితే ఎన్నికలకీ సరిగ్గా రెండు రోజులు ఉండగా కూడా ఐటీ దాడులు జరగడం చర్చనీయాంశం అయ్యింది. నిన్న రాత్రి టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అకౌంటెంట్ ఇంట్లో ఐటీ సోదాలు జరిగాయి. ఇక దీంతో ఒక్కసారిగా బగ్గుమంది టీడీపీ అధిష్టానం.

ఇక టీడీపీ నేతలు గుర్రుమనడంతో కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి బిజెపి నేత అరుణ్ జైట్లీ మీడియా ముందుకి వచ్చారు. ఢిల్లీలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ.. అవినీతికి వ్యతిరేకంగా ఐటీ శాఖ చేపట్టే ఎలాంటి చర్యనైనా రాజకీయ కక్షసాధింపు చర్యగా పరిగణిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతికి పాల్పడి ఐటీ దాడులు జరుగుతుంటే వేధిస్తున్నారని చెప్పడం ఎంతమాత్రం సరికాదని వ్యాఖ్యానించారు. ఇలా మాట్లాడటం కేవలం విపక్షాలకే చెల్లిందని దుయ్యబట్టారు. విపక్షాలు ఇలాంటి విషయాలని తప్పుబట్టొద్దని ఎద్దేవా చేశారు.

Share.

Comments are closed.

%d bloggers like this: