9 శాతం మాత్రమే నమోదైన పోలింగ్..! 30 శాతం ఈ‌వీఎం లు మొరాయించాయి..!

Google+ Pinterest LinkedIn Tumblr +

నేడే తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ జరుగుతుంది. తెలంగాణ లోనూ ఆంధ్రప్రదేశ్ లోనూ రాష్ట్రవ్యాప్తంగా జనాలు వోటు వేయడానికి బయలుదేరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో 175 అసెంబ్లీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలకు పోటీ జరుగుతుంది ఇక తెలంగాణ లో 16 ఎంపీ స్థానాలకు పోటీ జరుగుతుంది. రాజకీయ ప్రముఖులు సినీ నటులు ఇప్పటికే తమ వోటు హక్కుని వినియోగించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో 175 అసెంబ్లీ స్థానాలకు గాను 2,118 అభ్యర్థులు బరిలోకి దిగనున్నారు. ఇక 25 ఎంపీ స్థానాలకు గాను 319 మంది పోటీ లో ఉన్నారు.

ఏపీ రాష్ట్రంలో ఈ ఏడాది జనవరి నాటికి ఏపీ జనాభా 5,30,01,971. అందులో మొత్తం ఓటర్ల సంఖ్య 3,93,45,717గా నమోదైంది. అయితే ఇందులో పురుషులు 1,94,62,339, స్త్రీ ఓటర్లు 1,98,79,421, ట్రాన్స్‌జెండర్లు3967 మంది కూడ తమ ఓటు హక్కును నమోదు చేసుకొన్నారు. కాగా వీరందరూ తమ ఓటు వినియోగించుకోడాని 45,920 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు.

అయితే ఎన్నికల అధికారులు అన్నీ విధాలా ఏర్పాట్లు చేసినప్పటికీ కొరత తప్పడం లేదు ఇవాలా ఉదయం నుండి పలు చోట్ల ఈవీఎం మిషన్లు పని చేయడం లేదు. దీంతో ఓటర్లు వెనుతిరుగుతున్నారు. రాజకీయనేతలు పార్టీ అధినేతలు ఇప్పటికీ ఈ విషయాలని మీడియా ముందు వెల్లడించారు. వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక ఈసీ వీరి ఫిర్యాదులకి స్పందిస్తూ అన్నీ చోట్ల ఈవిం‌ఎం లు పని చేస్తున్నాయని స్పష్టం చేశారు. కానీ ఓటు వినియోగించడానికి వచ్చిన జనం మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు పోల్ అయిన ఓటింగ్ 9 శాతం మాత్రమే. రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్లలో చైతన్యం ఉన్నప్పటికీ ఈవిఎం మొరాయించడంతో ఓటు వేయకుండా వెనుతిరిగి వెళ్తున్న ఓటర్లు. రాష్ట్ర వ్యాప్తంగా 30 శాతం ఏవిఎంలు మొరయించినట్లు స్పష్టమైన సమాచారం.

Share.

Comments are closed.

%d bloggers like this: