ఘర్షణలు.. గొడవలే.. కాకుండా వెలుగులోకి ‘రిగ్గింగ్’..!

Google+ Pinterest LinkedIn Tumblr +

రాష్ట్రంలో పోలింగ్ జరుగుతుంది.. ఎలక్షన్ కమిషన్ విస్తృతంగా పనిచేస్తున్నప్పటికి పలు చోట్ల అసహనాలు అసంతృప్తులు.. ఉద్రిక్తతలు..! బారిగా బందోబస్తు నిర్వహిస్తున్నప్పటికీ ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఇరు వర్గాల వారు ఒకరి పై ఒకరు దాడులు చూసుకుంటున్నారు ఈక్రమంలో ఇప్పటికే అనంతపురంలో ఒక కార్యకర్త మృతి చెందిన వార్తా సంచలనమవుతుంది. ఇప్పటికే పలు చోట్ల టీడీపీ వైసీపీ వర్గాలా మధ్య ఘర్షణలు నెలకొన్నాయి.

తాజాగా కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం లోని పోలింగ్ కేంద్రం వద్ద ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. గుడెంచెరువు ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో వైసీపీ పోలింగ్ ఏజెంట్‌‌‌తో టీడీపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ టీడీపీ, వైసీపీ మధ్య తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు ఇరువర్గాలను చెల్లాచెదురు చేశారు. గాయపడిన పలువురిని జమ్మలమడుగు ఆసుపత్రికి తరలించారు. జిల్లా ఎస్పీ కూడా సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగారు దాంతో ఇప్పుడు కాస్త పరిస్తితులు సద్దుమనుగుతున్నాయి.

ఇక ఈ విషయం ఇలా ఉంటే గొడవలు ఘర్షణలే కాకుండా పలు చోట్ల రిగ్గింగ్ కూడా జరిగినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కాశీనయన మండలం గొంతువారిపల్లె 97వ పోలింగ్‌బూత్‌లోకి చొరబడిన వైసీపీ నేతలు ఓటర్లను బయటకు పంపేశారని, పోలింగ్ కేంద్రం తలుపులు మూసి రిగ్గింగుకు పాల్పడ్డారని టీడీపీ నేతలు ఆరోపించారు. మరి ఈ వార్తా ఎంత వరకు వాస్తవమో అధికారులే దృవీకరించాలి.

Share.

Comments are closed.

%d bloggers like this: