ఆంధ్రలో 41 శాతం నోమోదైన పోలింగ్..!- ద్వివేధి

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారు గోపాల కృష్ణ ద్వివేధి మీడియా ముందుకి వచ్చారు. ఆయన మాట్లాడుతూ.. పలు అంశాలని వెల్లడించారు. మద్యాహ్నం 1 గంటల వరకు 41 శాతం పోలింగ్ నమోదైనట్టు ఆయన తెలిపారు. ఓటర్లు ఓటు వేసేందుకు చాలా ఆసక్తి చూపుతున్నారని ఆయన అన్నారు. ఇప్పటికీ కూడా చాలా మండి క్యూ లైన్ లలో వేచి ఉన్నారనై ఆయన తెలియజేశారు. సాయాంత్రమ్ 6 గంటల లోపు క్యూ లైన్ లో నిలుచున్న ప్రతి ఒక్కరికీ ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు.

ఉదయం నుండి వచ్చిన ఫిర్యాదుల మేరకు అన్నీ సమస్యలు దాదాపుగా పరిష్కరించామని ఆయన తెలిపారు. మొత్తం 381 ఈవీఎం లలో సమస్యలు వచ్చాయి. ఆ ఈవీంఎం ల సమస్యలు పరిష్కరించినట్టుగా ఆయన పేర్కొన్నారు. ఘటనలపై ఆయన స్పందిస్తూ.. మొత్తం 20 చోట్ల హింసాత్మక ఘటనలు జరిగినట్టుగా ఆయన పేర్కొన్నారు. ఆ ఘటనలు జరగడానికి కారణమైన వారి పై ఎఫ్‌ఐ‌ఆర్ లు నమోదు చేసినట్టుగా ఆయన తెలిపారు. తాడిపత్రిలో ఒక వ్యక్తి హత్యకి గురవ్వడం బాధాకరం అని ఆయన అన్నారు. గొడవలు జరిగిన ప్రాంతాల్లో మళ్ళీ పోలింగ్ నిర్వహించే విషయం పై అధికారులతో చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకుంటాం అని ఆయన పేర్కొన్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: