త్వరలో శ్రీదేవి చిన్నకుతురు ‘ఖుషీ’..! కరణ్ జోహర్ దే బాధ్యత..!

Google+ Pinterest LinkedIn Tumblr +

అలనాటి నుండి నేటి వరకు సినీ ప్రపంచంలో తన పేరు ఎప్పుడూ ప్రస్తావన లోకి వస్తూనే ఉంటుంది. భాష బేదం లేకుండా దాదాపుగా అన్నీ భాషల్లో ఆమె నటించింది. బాలీవుడ్ లోనూ టాలీవుడ్ లోనూ ఆమె తనకంటూ ఒక చెరగని ముద్ర వేసుకుంది ఆమెనే మహానటి శ్రీ దేవి. ఇక శ్రీ దేవికి తన కూతుర్లని సిల్వర్ స్క్రీన్ పై చూడాలి అన్నదే కోరిక. ఆమెకి ముగ్గురు కూతుర్లు పెద్దా కూతురు జాన్వీ కపూర్ ఇక చిన్న కూతురు ఖుషి కపూర్.శ్రీదేవి బ్రతికున్నప్పుడే జాన్వి తన మొదటి సినిమాని మొదలు పెట్టింది కానీ శ్రీదేవి చనిపోయిన తరువాత సినిమా రిలీజ్ అయ్యింది.

ఇక ఆమె ఆ సినిమాని చూడలేకపోయింది. జాన్వి కపూర్ మొదటి సినిమా అంతగా ఆడలేకపోయినా తన నటన కి మంచి గుర్తింపు వచ్చింది. సినిమా ఆడనప్పటికీ తనకి అవకాశాలు మాత్రం చాలానే వచ్చాయి. జాన్వి నటన నచ్చిన దర్శకులు ఆమెకి అవకాశాల మీద అవకాశాలు ఇస్తున్నారు. ఇకపోతే చిన్న కూతురు ఖుషీ కి కూడా సినిమాలన్నా మోడలింగ్ అన్నా ఇష్టమట. ఒకపక్క సినిమాలపై ఎంత ఇష్టం ఉందో మరోపక్క మోడలింగ్ పై కూడా అంటే ఇష్టం ఉందట. ఇక ఎటు వెల్లాలో తనకి అర్ధంకాక కన్ఫ్యూజన్ లో ఉందట. కానీ జాన్వీ మరియు తన తండ్రి సలహా ప్రకారం సినిమాల్లోకి రావాలని నిశ్చయించుకుందట. ప్రస్తుతం ఆమె లండన్ లో యాక్టింగ్ పట్ల శిక్షణ తీసుకుంటునట్టు సమాచారం. త్వరలో ఖుషీ ని లాంచ్ చేయబోతున్నారట ఈ బాధ్యతలనీ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహర్ తీసుకున్నట్టు సమాచారం.

Share.

Comments are closed.

%d bloggers like this: