రీపోలింగ్ పై నోరు విప్పిన ద్వివేధి..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేది మీడియా ముందుకి వచ్చారు ఆయన మాట్లాడిన అంశాలివీ.. 5గంటల వరకు 66శాతం పోలింగ్ నమోదు అయింది. రాష్ట్ర వ్యాప్తంగా 25 హింసాత్మక ఘటనలు జరిగాయి వాటిలో ఇద్దరు మృతి చెందారు. రిపోల్స్ కు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్ కు సమాచారం ఇచ్చాము. రిపోలింగ్ అంశంలో పూర్తి స్థాయిలో విచారణ జరిగిన తరువాత నిర్వహిస్తాం. మాకు వచ్చిన కొన్ని ఫిర్యాదుల ఆధారంగా రిపోలింగ్ నిర్వహిస్తాం. రాష్ట్రంలో పోలింగ్ విషయంలో మాకు వచ్చిన ప్రతి కంప్లైంట్ కేంద్ర ఎన్నికల సంఘానికి దృష్టికి తీసుకెళ్ళాం.

మాక్ పోలింగ్లో అధికారుల నిర్లక్ష్యానికి సంబంధించి 6 ఘటనలు మా దృష్టికి వచ్చాయి. రిపోలింగ్ అంశంలో పోలింగ్ కేంద్రాల్లో ఉన్న రిటర్నింగ్ అధికారులు, అబ్జర్వర్ల ద్వారా సమాచారం తీసుకొని నిర్ణయం తీసుకుంటాం. పూతాలపట్టు నియోజకవర్గంలో మూడు గంటలకే పోలింగ్ నిలిచిపోయింది. క్యూలో ఉన్నవారు ఓటింగ్ ఎంత సమయం పట్టిన ఓటు వేసుకొనే అవకాశం కల్పించాం. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎటువంటి ఘటనలు జరగలేదు. ఎన్నికల బందోబస్తుకు కేంద్ర బృందాలు ఎందుకు రాలేదనే విషయంపై నేను ఏమి చెప్పలేను. హింసాత్మక ఘటనలు ఎందుకు జరిగాయనే విషయంపై విచారణ చేపట్టాం.

రీపోలింగ్ కు సంబంధించి పోలింగ్ కేంద్రాల్లో ఉన్న సెక్యూరిటీ కెమెరాలు అక్కడ ఉన్న సిబ్బంది ద్వారా నిర్ణయం తీసుకుంటాం. ఎలక్షన్ కమిషన్ తప్పు చేసిందని ఆరోపణలు చేయడం సరైన పద్దతి కాదు. పోలింగ్ కు సంబంధించి సిబ్బంది తప్పులు ఉంటే కలక్టర్లతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం. ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాజకీయ పార్టీల నేతలు చేసే కామెంట్స్ పై నేను ఏమి మాట్లాడను. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణపై ఎన్నికల కమిషన్ పూర్తిగా సంతృప్తిగా ఉంది. ఫార్మ్ 17A ద్వారా రిపోలింగ్ పై నిర్ణయం తీసుకుంటాం అని ఆయన అన్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: