దాడులు ఇక్కడ..! స్కేచ్చులు అక్కడ..! ముందుగానే చెప్పాను..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. నన్ను కుటుంబ పెద్దగా నమ్మి ఓట్లు వేసినందుకు ప్రతీ ఒక్కరికీ నా ధన్యవాదాలు. నిన్న జరిగినవి ఎన్నికలు కాదు ప్రజాస్వామ్య యుద్ధం. నిన్న జరిగిన ఎన్నికల్లో పురాణాల్లో కూడా చూడని కుట్రలు చేశారు అంటూ ఆయన మండిపడ్డారు. ఈడి, సీబీఐ, తెలంగాణ పోలీసులు, ఐటీ లాంటి సంస్థలతో దాడులు చేసిన ఏపీ ప్రజలు బయపడలేదు. జన్మభూమీని కాపాడుకోడానికి అనేక రాష్ట్రాల నుండి దేశాల నుంచి వచ్చి ఓట్లు వేశారు. సొంత రాష్ట్రాన్నీ కాపాడుకోవడం కోసం ఎన్ని ఇబ్బందులు ఎదురైన ఓటింగ్ లో పాల్గొన్నారు. అందరికీ నా అభినందనలు.

బీజేపీ, టీఆరెస్, వైసీపీ కలిసి రాష్ట్రంలో ఉన్న ప్రజలను ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని పెట్టారు అని ఆయన వ్యాఖ్యానించారు. నిన్న ఉదయం నుంచి 30శాతం ఈవీఎంలు పని చేయలేదు. ఒకపక్క ఈవిఎంలు పని చెయ్యకపోతే రెండో వైపు ఒక పద్ధతి ప్రకారం గొడవలు చేశారు ప్రతిపక్షాలు. ఎన్నికల్లో హింసను రెచ్చగొట్టి దాడులు చేస్తున్నారని నేను ముందుగానే ఎన్నికల కమిషన్ కు పిర్యాదు చేశా నేను చెప్పినట్టుగానే దాడులు జరిగాయి. రాష్ట్రంలో ముగ్గురూ ఎస్పీలను అకారణంగా బదిలీ చేశారు. వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి విచారణ చెయ్యడమే కడప ఎస్పీ చేసిన నేరమా. గల్లా జయదేవ్ ఇంటిపై ఐటీ దాడులు చేయడం దేనికి సంకేతం అని ఆయన ప్రశ్నించారు.

ఎన్నికల నిర్వహణ అధికారే ఓటు వెయ్యలేకపోతే సాధారణ పౌరులు ఎలా ఓటు వేస్తారు..? ఈవీఎంలు రిపేర్ చేసేవారిని ఎవ్వరు అపాయింట్ చేశారు..? ఎవ్వరి అనుమతితో ఈవీఎంలు టెక్నీషియన్లను నియమించారు..? అని ఆయన ప్రశ్నించారు. ఈవిఎం, వివిఫ్యాట్ లపై మాకు అనుమానాలు ఉన్నాయని ముందుగానే చెప్పా. ఎన్నికల కమిషన్ ఎవ్వరి ఆధీనంలో నడుస్తుందో ప్రజలకు తెలియాలి.. అని ఆయన అన్నారు. ఎన్నికల కమిషన్ కు ఎన్నికల పట్ల కమిట్మెంట్ లేదు..! ఏపీలో ఎవరిని అడిగి చీఫ్ సెక్రటరీని మార్చారు..? రాష్ట్రంలో పెద్ద ఎత్తున హింస జరుగుతుంటే సీఎస్ వెళ్లి డీజీపీని కలవడం ఏంటి? అని ఆయన ప్రశ్నించారు.

A2 కంప్లైంట్ చేసై ఏపీలో ఎస్పీలను మారుస్తారా. బీజేపీ పాలనలో వ్యవస్థలు నాశనం అయ్యాయి అవుతున్నాయి. ఎన్నికల్లో హింస వల్ల 36 మంది ఆసుపత్రి పాలయ్యారు, ఇద్దరు మృతి చెందారు. ప్రజాస్వామ్యన్నీ గెలిపించుకోవడానికి రాష్ట్ర ప్రజలు ముందుకు రావడం ఆనందంగా ఉంది. 4583 పోలింగ్ సెంటర్లలో ఈవీఎంలు మొరయించాయని అఫీషియల్ గా వచ్చిన సమాచారం. దేశంలో ఇటువంటి ఎన్నికలు నిర్వహించిన పనికిమాలిన కమిషనర్ ఎవ్వరు లేరు అంటూ ఆయన ఎన్నికల అధికారులపై మండిపడ్డారు.
జగన్ హైదరాబాద్ వేదికగా ఎన్నికల్లో దాడులకు స్కెచ్ వేశారు. అపొజిషన్ పార్టీకి ఎన్నికల్లో డబ్బు పంపిణీ చేసింది. అంతా డబ్బు పంపిణీ చెయ్యడానికి ఇన్ని వేళా కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి..? అని ఆయన ప్రశ్నించారు.

Share.

Comments are closed.

%d bloggers like this: